హైదరాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. నిత్యం రద్దీగా కనిపించే మహానగరం వెలవెలబోతోంది. ప్రజలు ఓట్లు వేసేందుకు సొంతూళ్ళకు వెళ్ళడంతో నగరమంతా బోసిపోయింది. ఇది హైదరాబాదేనా అనుమానం వచ్చేలా హైదరాబాద్ నిర్మానుష్యంగా మారింది.
కరోనా సమయంలో ఖాళీగా కనిపించిన రోడ్లు మూడేళ్ల తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఇప్పడే దర్శనమిస్తున్నాయి.ప్రధానంగా కూకట్ పల్లి, అమీర్ పేట్, యూసుఫ్ గూడతోపాటు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం అమలులో ఉన్నట్టే కనిపించింది. ఈ ఏరియాలో ఏపీ వాసులు అధికంగా ఉంటారు. ఎన్నికల్లో ఓటేసేందుకు వారంతా సొంత రాష్ట్రానికి వెళ్ళడంతో ట్రాఫిక్ ఫ్రీ నగరంగా మారింది.
హైదరాబాద్ లో ఎప్పుడూ రద్దీగా కనిపించే ఫ్లై ఓవర్లు జనాలు లేక బోసిపోయాయి. నిత్యం ట్రాఫిక్ రద్దీతో ప్రయాణం నరకంలా భావించే నగర ప్రజలు ఈ ఖాళీని చూసి నోరెళ్ళ బెడుతున్నారు. అసలు మనం హైదరాబాద్ లోనే ఉన్నామా..? మరో మారుమూల ప్రాంతంలో ఉన్నామా..? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.