మెటా ఓనర్ జుకర్ బుర్గ్ కు భారత పార్లమెంటరీ ప్యానల్ నోటీసులు జారీ చేసింది. మోడీ గత ఎన్నికల్లో ఓడిపోయారని చేస్తున్న తప్పుడు ప్రచారానికి సమాధానం చెప్పాలని ఈ నోటీసులు ఇచ్చారు. ఇటీవల జుకర్ బర్గ్ ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడినప్పుడు.. కోవిడ్ కారణంగా ప్రపంచంలోనే చాలా దేశాల ప్రభుత్వాలు మారిపోాయన్నారు. ప్రజల్లో అసంతృప్తి వల్ల అధికార పార్టీలపై వ్యతిరేకత పెరిగిపోవడమే దీనికి కారణం అని చెబుతూ.. ఇండియా ను కూడా ఉదాహరణగా చెప్పారు.
నిజానికి ఇండియాలో అధికార పార్టీగా ఉన్న బీజేపీ మరోసారి విజయం సాధించింది. ఎన్డీఏ కూటమిగా రంగంలోకి దిగి విజయాన్ని అందుకుంది. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జుకర్ బెర్గ్ కు అవగాహన లేదో.. లేకపోతే బీజేపీ పూర్తి మెజార్టీ సాధించలేకపోవడం వల్ల ఓడిపోయిందని ఆయన తనకు తాను నిర్ణయించుకున్నారో కానీ ఈ మాట అనేశారు. తాము గెలిచి ప్రభుత్వంలో ఉన్నా.. సరే తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని బీజేపీ మండిపడింది. అందుకే పార్లమెంటరీ కమిటీ ద్వారా నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని నిర్ణయించారు.
జుకర్ బెర్గ్ ఈ నోటీసులపై ఎలా స్పందిస్తారో కానీ.. ఆయన అధికార పార్టీ ఓడిపోయిందని చెప్పిన విషయం హైలెట్ అవుతోంది. నిజానికి బీజేపీని సింగల్ గా సీట్ల పరంగా చూస్తే.. పరాజయం కిందే లెక్క అనుకోవచ్చు. అయితే టెక్నికల్ గా కాదు. కూటమిగ పార్టీలన్నీ కలసి పోటీ చేశాయి కాబట్టి ఎన్డీఏనే మళ్లీ విజయం సాధించింది. తన కామెంట్లకు జుకర్ బెర్గ్ ఎలాంటి వివరణ ఇస్తారో కానీ.. ఆయన బీజేపీ ప్రభుత్వంతో సామరస్యంగానే ఉంటున్నారు. ఎప్పుడూ లడాయి పెట్టుకోలేదు.