ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ పెట్టుబడితో అనకాపల్లి జిల్లా రాత మారిపోనుంది. రెండు దశల్లో రూ. లక్షా నలభై వేల కోట్ల పెట్టుబడులు్ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కన్నా ఎక్కువ మందికి ఉపాధి లభించబోతోంది. భూసేకకరణ కూజా పెద్దగా అవసరం లేదు. ఈ కారణంగా ప్రాజెక్టు వీలైనంత త్వరగా మెటీరియలైజ్ కానుంది. వైసీపీ హయాంలో ఐదేళ్ల కాలంలో చిన్న పరిశ్రమను తీసుకురాలేకపోయారు. ఏపీలో పెట్టుబడులు అంటేనే భయపడి పారిపోయే పరిస్థితికి తీసుకు వచ్చారు. కొత్త ప్రభుత్వం ఆ భయాలను పోగొట్టేందుకు ప్రయత్నిస్తోంది.
నాలుగు నెలలకాలంలో ఎన్నో పరిశ్రమల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి కానీ ఆర్సెలార్ మిట్టల్, నిప్పల్ స్టీల్ పెట్టుబడుల ప్రతిపాదన మాత్రం ఊహించనిది. జూలైలో నారా లోకేష్ ఒక్క జూమ్ కాల్ తో పెట్టుబడిదారులను ఒప్పించారు. మిగతా ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మరో వారం రోజుల్లో ఎంవోయూ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పెట్టుబడితో ఉత్తరాంధ్ర మొత్తం ప్రభావం ఉంటుంది. ప్రపంచ పెట్టుబడిదారులు చూపు ఉత్తరాంధ్రపై పడే అవకాశం ఉంది.
ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్‌కు పెద్ద ఎత్తున గనులు ఉన్నాయి. చత్తీస్ ఘడ్ నుంచి… ఒడిషా నుంచి వారు ముడి ఖనిజం తెచ్చుకుంటారు. వారికి వనరుల కొరత లేదు. ప్లాంట్ పెట్టడం ఆలస్యం ఉత్పత్తి ప్రారంభమవుతుంది. పారిశ్రామికంగా ఉత్తరాంధ్ర ఈ ప్లాంట్‌తో మరింత ముందుకు వెళ్లనుంది. విశాఖ నగరాన్ని సాఫ్ట్ వేర్ పరిశ్రమల కేంద్రంగా చేయడానికి నారా లోకేష్ ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. టీసీఎస్ పదివేల ఉద్యోగులతో క్యాంపస్ ప్రారంభించనుంది. ఉత్తరాంధ్ర పారిశ్రామిక రంగానికి మంచి రోజులు వచ్చేశాయని అనుకోవచ్చు.