ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆయన మైండ్ సెట్, వ్యక్తిత్వం లోపల ఎంత బురదగుంటలో ఉన్నప్పటికీ బయటకు మాత్రం డిగ్నిటీ చూపించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి అనేది ఓ వ్యక్తి మోసేది కాదు.. అది ఓ వ్యవస్థ. ఏమైనా తేడా వేస్త ఆ వ్యవస్థ విలువనే కించపరిచినట్లు. ఇప్పటి వరకూ అధికారంలో ఉన్నచాలా మంది ఈ తేడాను గుర్తించే ప్రయత్నం చేశారు. అయితే ఒకే ఒక్క సీఎం మాత్రం .. సీఎం వ్యవస్థను తన నీచ, నికృష్ట బుద్దికి తగ్గట్లే ఉండాలని పట్టుబట్టి మరీ బురదలోకి లాగేస్తున్నారు. ఆయనే ఏపీ సీఎం జగన్.
రాజకీయ సభలకు.. ప్రభుత్వ కార్యక్రమాలకు తేడా తెలియదా ?
ప్రభుత్వాలు పథకాలు మీట నొక్కడానికి ఎప్పుడూ సభలు పెట్టేవి కావు. ప్రాజెక్టులు.. అభివృద్ధి పనులు ప్రారంభించినప్పుడు మాత్రం సభలు పెట్టేవారు. ఇవి ప్రభుత్వ సభలకు కాబట్టి ప్రోటోకాల్ ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ పార్టీలతో సంబంధం లేకుండా ఆహ్వానిస్తారు. అందుకే పులివెందులలో చంద్రబాబు సీఎంగా ఉన్పప్పుడు గండికోట ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ సభ ఏర్పాటు చేస్తే అవినాష్ రెడ్డిన కూడా స్టేజ్ ఎక్కించారు. మాట్లాడటానికి చాన్స్ ఇచ్చారు. ఎలాగూ వాళ్లందరికీ ఒకేబుద్ది కాబట్టి ఆయన తన నైజాన్ని చూపించుకున్నారు. అలా చేస్తాడని తెలిసినా మాట్లాడటానికి మైక్ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో అయితే.. ముందుగానే హౌస్ అరెస్ట్ చేసి పడేస్తారు. లేదంటే పోలీసులతో కొట్టించేవారు.. అంతా చేసి సభలో ఏం ప్రసంగిస్తారయ్యా.. అంటే.. ప్రతిపక్ష నేతలపై బూతులు, తిట్లు. అతి స్కూల్ పిల్లల కార్యక్రమం అయినా సరే నా బొచ్చేం పీకలేరంటూ మాట్లాడేస్తారు సీఎం. ఇంత వికృత మనస్థత్వం ఎలా ?
సభా వేదికలపై నుంచి చావులు కోరుకునే సైకోతనం ఊహించగలమా ?
సభలు సమావేశాలు పెడతారు. ప్రతిపక్ష నాయకులపై ఏడుస్తారు.ఆ ఏడుపులు ఎలా ఉంటాయంటే… వాళ్ల చావులు కోరుకునేంత. వాళ్లు చనిపోతే తాను హాయిగా ఉంటానన్నట్లుగా ఉంటుంది ఈ ముఖ్యమంత్రి మాటలు వింటూంటే. చంద్రబాబు వెంటిలేటర్ పై ఉన్నాడు.. గుండెపోటు వచ్చి టిక్కెట్ కొంటారు..ఇలాంటి మాటలతో మానసిక వికృతాన్ని పొందుతున్నారు. ముసలోడంటూ మాట్లాడుతూంటారు. ఇలాంటి వాళ్లను సీఎంగా ఎన్నుకున్నందుకు ఓట్లేసిన ప్రజలు సిగ్గుపడతారో లేదో.. కానీ పెద్దవాళ్లంతా మాత్రం.. ఈ పెంపకాన్ని హర్షించరు. ఇలా ఎలా పెంచారని అనుకుంటారు.
ఏది మాట్లాడిదే అదే తిరిగి వస్తుంది – సీఎం వ్యవస్థకే కదా మచ్చ !
ఇప్పుడు జగన్ ను చంద్రబాబు అరేయ్.. ఒరేయ్ అంటున్నారు. నేతల నేతలు బూతులు తిడుతున్నారు. ఇప్పుడు పదవి ఉంది కాబట్టి పద్దతిగా తిడుతున్నారు. పదవి పోయిన రోజున ఆయనను ఎవరు ఏమని తిడతారో అంచనా వేయడం కష్టం. తిట్టించడం ఇష్టం అయిన జగన్ కు అప్పుడు తిట్టించుకోవడం కామన్ అవుతుంది. కానీ ఆయన దిగజార్చిన వ్యవస్థ గౌరవం మాత్రం తిరిగి రాదు కదా. అందుకే పెద్దలు చెంబుతూంటారు.. కనకపు సింహాసమున శునకాన్ని కూర్చుండబెట్టిన.. బుద్ది మారదని. దాన్ని నిజం చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ సింహాసనం కూడా చీప్ గా మారిపోయింది.