వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆర్ణబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ.. నెలకోసారి బూస్ట్ ఇస్తూ ఉంటుంది. నేషనల్ అఫ్రూవల్ రేటింగ్స్ పేరుతో చానల్.. కొన్ని ఫలితాలను ప్రకటిస్తూ ఉంటుంది. ఆ చానల్ ప్రకటించే ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. బీజేపీకి పది శాతం ఓట్లు .. కాంగ్రెస్ కు రెండు సీట్లు కూడా వేస్తూ ఉంటారు. వైసీపీకి… ఇరవై సీట్లకు దరి దాపుల్లోనే ఇస్తూ ఉంటారు. ఈ సారి అలాంటి సర్వే వచ్చింది. వైసీపీ బ్యానర్ గా ప్రచురించుకుంది. కానీ రిపబ్లిక్ నేషనల్ అప్రూవల్ రేటింగ్ప్ ప్రకటిస్తున్న సమయంలోనే ఇండియా టీవీ – కార్వీ, ఇండియా టుడే- సీ ఓటర్ సర్వేలు కూడా బయటకు వచ్చాయి. ఈ రెండు సర్వేల్లో… భిన్నమైన ఫలితాలొచ్చాయి. కానీ ఈ సర్వేలను తక్కువ చూపించి వైసీపీ సంబరపడిపోతోంది. నిజానికి ఈ సర్వేల్లో.. వైసీపీకి ఐదు లోపే సీట్లు వస్తాయని పరోక్షంగా చెప్పారు.
కాంగ్రెస్ కు చాలా దూరంగా… బీజేపీకి కొంచెం దూరంగా ఉంటున్న బిజూ జనతాదళ్, వైసీపీ, టీఆర్ఎస్ అన్నాడీఎంకే కలుసినా… ఎన్డీఏకు ఒకటి, రెండు సీట్లు తక్కువే పడతాయని.. ఇండియా టీవీ – కార్వీ, ఇండియా టుడే- సీ ఓటర్ సర్వేలు దాదాపుగా ఒకే రకమైన ఫలితాన్ని ప్రకటించారు. . అదే బీజేపీకి ఆమడ దూరంలో ఉంటూ.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తోనే కలుస్తామని చెబుతున్న తృణమూల్, ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ లాంటి పార్టీలు గెలుచుకునే సీట్లతో.. యూపీఏ అధికారంలోకి రావొచ్చని చెప్పాయి. ఈ సర్వేల్లో దక్షిణాది కీలకం. ఎన్డీఏకు 14 సీట్లు, బీజేపీకి దగ్గరగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్, వైసీపీలకు 37 సీట్లు సట్లు వస్తాయని అంచనా వేశారు. అంటే ఇందులో టీఆర్ఎస్ కు 15 సీట్లు ఖాయం అనుకుందాం.. బీజేడీకి ప్రధానంగా పోటీ ఇచ్చే స్థాయిలో ఒడిషాలో బీజేపీ ఎదగలేదు. కాబట్టి అక్కడ ఉన్న 21 లోక్ సభ సీట్లలో కనీసం 15 అయినా బీజేడీ సులువుగా సాధిస్తుంది. ఇక అన్నాడీఎంకే, వైసీపీ కలిసి ఏడు స్థానాలు సాధిస్తాయనుకుందా. ఎలా చూసినా.. వైసీపీ పరిస్థితి ఏమీ బాగోలేదని ఈ సర్వేలు చెప్పేశాయి.
కానీ వైసీపీ కోసం కొన్ని జాతీయ మీడియాలు మాత్రం.. పదే పదే … అత్యధిక లోక్ సభ సీట్లు ఇస్తూ.. ఫలితాలు విడుదల చేస్తూ ఉంటాయి. వాటిని సాక్షి పత్రిక.. టీవీ ప్రధానంగా ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. ఇలాంటి సర్వేల వల్ల ప్రజాభిప్రాయం మారుతుందో లేదో కానీ.. సాక్షి మాత్రమే.. వీటికి ప్రాధాన్యం ఇవ్వడం.. ఎప్పుడూ ఒకే రకంగా ఫలితాలు ప్రకటిస్తూ ఉండటంతో ప్రజల్లోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి.