ఇండియన్ సినిమాలో సూపర్ మ్యాన్ సినిమాలు వున్నాయి కానీ సూపర్ విమన్ సినిమాలు అరుదే. ఇంద్రాణి – ఎపిక్ 1: ధరమ్ vs కరమ్ అలాంటి అరుదైన సూపర్ విమన్ సినిమాగానే వచ్చింది. స్టిఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో సైన్స్ ఫిక్షన్ అడ్వంచర్ గా రూపొందిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో కొన్ని లోతైన, సన్నితమైన, వివాదస్పద అంశాలు వుండటంతో దర్శకుడు స్టిఫెన్ పల్లం సినిమా చూసిన, చూడబోయే ప్రేక్షకులకు కొంత వివరణ ఇచ్చారు.
భారత భూభాగాలపై శత్రువులు సర్జికల్ స్ట్రైక్స్లు చేస్తే ఏమి జరుగుతుందనే కల్పిత అంశం చుట్టూ జరిగే కథ ఇది. ఇండియా అందుకు సిద్ధంగా ఉందా లేదా అనే అంశం ఉంటుంది. దిన్ని ప్రేక్షకులు తెరపై చూస్తున్నపుడు తమ మనోభావాలు గాయపడకుండా ఇది కల్పిత కథగానే చూడాలని కోరారు. అలాగే మూవీలో విధిని చూపించడానికి స్మోకీ గోస్ట్ ఎఫెక్ట్ ను ఉపయోగించామని, ప్రేక్షకులు దాన్ని అర్ధం చేసుకోవాలని కోరారు. అలాగే మూగ న్యూస్ యాంకర్ సునైనా, గ్రౌండ్ రిపోర్టర్ సప్తగిరి మధ్య వచ్చే సన్నివేశం కూడా వినోదం కోసం పెట్టిందే కానీ మీడియాని కించపరిచే ఉద్దేశం కాదని చెప్పారు.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ప్రజెంట్ చేయడం, టైం లైన్ పై పలు డేట్లు ఇవ్వడం జరిగిందని, అవన్నీ పరిశీలించే గమనిస్తే కథనం ప్రేక్షకులుని మరింతగా లీనం చేస్తుందని చెప్పారు. 2-3 సన్నివేశాలలో పాత్రల మధ్య సుదీర్ఘమైన సంభాషణలు ఉంటాయని, ఇవి కథని అర్ధం చేసుకోవడంలో ముఖ్య భూమిక పోషిస్తాయని, ప్రేక్షకులు ఆ డైలాగ్స్ ని మనసుపెట్టి వినాలని, ముఖ్యంగా, సినిమాలో ఉపయోగించిన కాన్సెప్ట్లు ప్రేక్షకులకు చాలా కొత్తగా ఉంటాయని టైమ్ ట్రావెల్ ప్రొసీడింగ్స్ ని దృష్టి పెట్టి చూడాలని కోరారు. సినిమా ప్రారంభం, ఇంటర్వెల్ తర్వాత బిగినింగ్ సీన్ మిస్ అవ్వకండని కోరిన ఆయన సినిమా చూసినప్పుడు పైన చెప్పిన ప్రతి అంశాన్ని ద్రుష్టిలో పెట్టుకొని చూడాలని కోరారు. సినిమా ఇంకా చూడని ప్రేక్షకులు తప్పకుండా వెళ్లి చూడాలని, ఇంద్రాణి ఓ సరికొత్త మాస్ మార్వల్ అనుభూతిని ఇస్తుందని చెప్పుకొచ్చారు.