“పక్కాగా దోపిడీ చేశారు. వాటాల దగ్గర తేడాలొచ్చి కొట్టుకుని దొరికిపోయారు ” ఇలాంటి వార్తలు న్యూస్ పేపర్ క్రైమ్ కాలమ్స్‌లో వారానికి ఒక్క సారైనా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కలసికట్టుగా దొంగతనం చేసినా పంచుకునే దగ్గర సమానత్వం లేకుండా ఎవరికి వారు ఆశపడటం వల్లనే .. తమకు దక్కనిది భాగస్తుడికీ దక్కకూడదన్న కుట్రతో దొరికిపోయేలా చేసుకుంటారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే ఎవరికైనా జీవితానుభవమే పాఠాలు నేర్పాలి కానీ… వేరేవారిని చూసి నేర్చుకోవడం అసాధ్యమని అనుకోవచ్చు.
కుటుంబం అంతా కలసికట్టుగా చేసిన ప్రజాదోపిడి
జగన్ కుటుంబానికి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి. వైఎస్ రాజారెడ్డి దొంగతనాలు, హత్యలు, ఖూనీలు చేసిన సంపాదన ఎంత ?. వైఎస్ సీఎం అయ్యేదాకా ఆయనకు ఉన్న ఆస్తి ఎంత ?. ఆయన సీఎం అయ్యాక ఆయన కుటుంబం మొత్తం కుబేర సామ్రాజ్యాన్ని ఎలా నెలకొల్పింది అని ఒక్క సారి తరచి చూస్తే ఎంత ప్రణాళిక ప్రకారం దోపిడీ చేశారో అర్థమైపోతుంది. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి వారి నుంచి పెట్టుబడుల రూపంలో లంచాలు తీసుకున్నారు. అంటే ప్రజాఆస్తుల్ని సొంతానికి అమ్ముకున్నారన్నమాట. ఇందులో ఎవరూ తక్కువ కాదు. అందరూ ఎవరి స్థాయిలో వారు సాయం చేశారు.
ఇప్పుడు దోపిడీ సొమ్ము అంతా తానే కొట్టేయాలనుకుంటున్న జగన్
వైఎస్ హఠాత్తుగా చనిపోవడంతో దోచినదంతా తానొక్కడితేనని జగన్ ఆశపడటంతోనే అసలు కథ ప్రారంభమయింది. అందరికీ వాటా ఇస్తానని చెప్పి నమ్మించి .. తర్వాత సొంత చెల్లికైనా ఎందుకు ఇవ్వాలని ఆయన అనుకున్నారు. కానీ ఆమె కూడా వైఎస్ బిడ్డ.. జగన్ సోదరి. జగన్ కే అంత తేలివితేటలుంటే ఆమెకు మాత్రం ఉండవా ?. ఈ లాజిక్ ను జగన్ ఆలోచించలేక రోడ్డున పడ్డారు. ఇప్పుడు దొంగ సొమ్ము కోసం తల్లి, చెల్లితో జగన్ చేస్తున్న రాజకీయం ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశమవుతోంది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నా అందులో నిజాయితీ ఉండాలని లేకపోతే ఇలాగే దొరికిపోతారని చెప్పుకుంటున్నారు.
దోచిన ఆస్తంతా ప్రజలకు ఇచ్చేస్తేనే ప్రాయశ్చిత్తం
ప్రజల సొమ్మును దోచుకుంటే ఆ పాపం జీవితాంతం వెంటాడుతుంది. అది చిన్న విషయం కాదు. రాజకీయాల్లో రెండు రకాల దోపిడీలు ఉంటాయి. ఒకటి దోపిడీచేసినా దాన్ని పూర్తిగా ఎన్నికలు, రాజకీయాల కోసమే ఖర్చు పెట్టడం. రెండు వ్యక్తిగత ఆస్తుల్ని పెంచుకోవడం. మొదటిది ఎలాగూ ప్రజల్లోకి వెళ్తుంది. రెండోది మాత్రం క్షమించరాని నేరం. పాపం కూడా. ఆ పాపం చుట్టుకుంటే చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు జగన్ ఫ్యామిలీని చూస్తే అర్థమైపోతుంది. దోచుకున్నదంతా ప్రజలకు తిరిగి ఇచ్చేస్తే ఎంతో కొంత ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లవుతుంది.