ఓ సాదాసీదా జర్నలిస్టుగా ఉన్న కురసాల కన్నబాబును చిరంజీవి రాజకీయాల్లోకి తీసుకు వచ్చి ఎమ్మెల్యేను చేశారు. ఆయన తర్వాత చిరంజీవిపై.. ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చాలా ప్రాధాన్యం ఇస్తున్నారని భ్రమపడి అలా మూలాల్నే కించ పర్చుకున్నారు. కానీ ఆయనను వైసీపీ వాడుకున్నంత వాడుకుని రెండున్నరేళ్లకే షెడ్డుకు పంపేసింది. చాలా మందికి బయట మాట్లాడే చాన్సిచ్చారు కానీ కన్నబాబుకు మాత్రం చాన్సివ్వలేదు. అసలు ఆయన గురించి ఎక్కడా కనిపించని వినిపించని పరిస్థితి. మళ్లీ హఠాత్తుగా ఆయన అవసరం వైసీపీ పెద్దలకు వచ్చింది.
మూడు రాజధానుల గురించి మాట్లాడాలని ఆయనకు సమాచారం ఇచ్చింది. కన్నబాబు.. ఇలా గుర్తిస్తే చాలన్నట్లుగా మీడియా ముందుకు వచ్చి తన జర్నలిస్టిక్ తెలివితో మాట్లాడేశానని అనుకున్నారు. కానీ ఆయన రాజకీయం చూసిన వారు మాత్రం ఇలాంటి వారికి ఎప్పుడైనా ఇదే గతి పడుతుందని అంటున్నారు. కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన .. కనీసం ఓ ప్యూన్‌ను కూడా బదిలీ చేయించుకోలేరు. పార్టీ పరమైన పదవి ఉన్నప్పటికీఆయనను ఎవరూ సంప్రదించరు. ఎందుకంటే కాకినాడ మొత్తానికి వైసీపీ తరనున డాన్‌గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.
కన్నబాబు మాజీ మంత్రి అయినా అంతా ద్వారంపూడిదే హవా. ఇలాంటి రాజకీయాల్లోనూ తన అస్తిత్వాన్ని కించపర్చుకుంటూ కన్నబాబు… తన అవసరం వచ్చినప్పుడు హైకమాండ్ మాట్లాడమన్న మాటలను మాటలను మాట్లాడుతున్నారు. ఇటీవల మళ్లీ కొన్ని మంత్రి పదవుల్ని మారుస్తానని జగన్ ప్రకించగానే కొడాలి నాని.. పేర్ని నాని వంటి వారు తెరపైకి వచ్చారు. ఈ కోణంలో కన్నబాబు కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారేమో ?