నేను లేస్తే మనిషిని కాదు కానీ లేవను అన్న సామెత గుర్తుకు వస్తుంది పవన్ కల్యాణ్ రాజకీయ ప్రకటనలు చూస్తే అని ఇతర పార్టీల నేతలు సెటైర్లు వేస్తే.. అందులో వారి రాజకీయం ఏమీ ఉండదు. పవన్ కల్యాణ్ వ్యవహారశైలి వల్లే వారు అలా అంటారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి తాను రోడ్ల మీదకు వస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. మరోసారి అలాంటి హెచ్చరికలే జారీ చేశారు. వైసీపీ జెండా దిమ్మెల విషయంలో… విజయవాడ నేత పోతిన మహేష్‌తో పాటు మరికొందరిపై కేసలు పెట్టారు. అయితే అది తప్పుడు కేసు.. తెల్లవారు తామున కోర్టు ముందు హాజరు పరిస్తే రిమాండ్ విధించడానికి న్యాయస్థానం నిరాకరించింది.
దీనిపై వవన్ కల్యాణ్ స్పందించారు. ఇలాంటి పరిణామాలను సహించేది లేదని.. పార్టీ క్యాడర్‌ను కాపాకోవడానికి అవసరమైతే రోడ్ల మీదకు వస్తానని ప్రకటించారు. కానీ ఇంత కన్నా దారుణమైన పరిస్థితి వస్తేనే పవన్ రోడ్డెక్కుతారా అనే డౌట్ జనసైనికుల్లో వస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం.. పోలీసులను ఉపయోగించుకుని ఎంత దారుణమైన రాజకీయం చేస్తోందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. బాధితుల్లో టీడీపీ నేతలే కాదు జనసేన నేతలుకూడా ఎక్కువగానే ఉన్నారు. సోషల్ మీడియాపోస్టులు కూడా పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ పవన్ కల్యాణ్ ఇప్పటికీ… పరిస్థితి ఇలాగే ఉంటే రోడ్డెక్కుతా అనే ప్రకటనలు చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ రాజకీయంలో ఇప్పటికే అనేక లూప్ హోల్స్ బయటపడుతున్నాయి. ఆయనకు సీరియస్ నెస్ లేదని… కేవలం ప్రకటనలు చేస్తారని..వాటిని పట్టించుకోరన్న భావన పెరిగిపోతోంది. గతంలో చేనేతల్ని..ఇతర వర్గాల వారిని ఢిల్లీకి తీసుకెళ్లి మోదీతో కలిపిస్తానని మాటలు ఇచ్చారు. పాదయాత్రలు చేస్తానన్నారు. ఇలా చెప్పుకుటూ పోతే పవన్ చెప్పిన ఏ మాటనూ సీరియస్‌గా తీసుకోలేదు. అందుకే ఆయన తాను రోడ్డెక్కుతా అని చెబితే ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. రోడ్డెక్కాలంటే ఇంకా ఏం జరగాలనే ప్రశ్నను వినిపిస్తున్నారు.