పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ సోషల్ రిఫార్మరర్. ఎలా? రాజకీయ పొత్తు పెట్టుకుంటే సంస్కర్త అవుతాడా? అనేది మౌలిక ప్రశ్న…. పవన్ పెట్టుకుంది కేవలం రాజకీయ పొత్తు మాత్రమే కాదు. అసలు సిసలైన సోషల్ ఇంజనీరింగ్… ” కులాలని విడగొట్టే రాజకీయం కాదు, కులాలని కలిపే రాజకీయం చేస్తాను ” అనే నినాదం తో వచ్చి కేవలం మాటల్లో మాత్రమే కాకుండా ప్రతి అడుగులోనూ మాటలోనూ చేసి చూపించాడు పవన్ . ఈ ప్రయాణం లో సొంత వర్గాన్ని ఒకటి రెండు సార్లు మందలించడానికి కూడా వెనుకాడలేదు. ” నన్ను అర్థం చేసుకోండి, వ్యూహం నాకు వదిలి, నేను చెప్పింది పాటించండి… మిమ్మల్ని గర్వంతో తల ఎగరేసేలా చేస్తాను గానీ తల దించుకునే పని చెయ్యను ” అని హామీ ఇచ్చారు. 100 శాతం స్ట్రైక్ రేటుతో భారత దేశం లోనే గొప్ప విజయం జనసేన కి సాధించాడు. పల్లెల్లో, పట్టణాల్లో జనసైనికుల ఉత్సాహం, విజయ వైభవం చూస్తూ ఉంటే రాజకీయ పరిశీలకులు కూడా పవన్ అభిమానులుగా మారిపోయే పరిస్థితి.
కులాల విభజనతో దశాబ్దాలుగా రాజకీయ లాభం పొందిన ఓ వర్గం
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ, సినీ రంగాల్లో ఒక విషాదం కమ్మ-కాపు వర్గాల మధ్య గొడవ అనేది అన్ని వర్గాల ప్రజలకి తెలిసిన నిజం .. చిరంజీవి, బాలకృష్ణ సినిమా అభిమానుల్లో ప్రారంభమైన సినీ వైరుధ్యాలు …. విజయవాడ లో ఇద్దరు రౌడీ కుటుంబాల మధ్య వైరం దేవినేని మురళి, వంగవీటి రంగా హత్యల తర్వాత ముదిరి కులాల మధ్య పోరాటం గా మారింది…. దీన్ని సహజం గానే మూడో ప్రత్యర్ధి వర్గం వీలైనప్పుడల్లా వాడుకొని నాలుగు దశాబ్దాల నుంచి ఈ ప్రాంతం పై పట్టు సాధించి… ప్రభుత్వ, ప్రైవేటు వనరులు దోచుకొని వేల కోట్లకి పడగలు ఎత్తారు …. ఈ సమస్య ని పరిష్కరిస్తే గానీ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి లో కీలక మార్పు రాదు అని చాలా మందికి తెలుసు కానీ ఆచరణ దిశగా రెండు వర్గాలని డ్రైవ్ చేసే నాయకుడు లేడు… ఉన్నా సాహసం చెయ్యలేదు.
కులాలను ఏకం చేయడం అనే ఫార్ములాతో పవన్ పొలిటికల్ ప్రయోగం
ప్రజారాజ్యం ప్రయోగం విఫలం అయ్యాక ఇది ఇలా వర్కౌట్ అవ్వదు… బలమైన ఇంకో వర్గం మద్దతు లేకపోతే ముందుకు వెళ్లడం సాధ్యమో అసాధ్యమో గానీ…. ప్రస్తుతానికి సంధి చెయ్యడం అయితేనే ఉత్తమ మార్గం అనే అద్భుతమైన వ్యూహాన్ని రచించి… తన వర్గం నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొని… ఒక ఓటమి తర్వాత కూడా… సిద్ధాంతం మార్చుకోకుండా నమ్మిన టార్గెట్ ( కులాలని ఏకం చెయ్యడం ) కే కట్టుబడి ఆ తర్వాత నాలుగేళ్లు కూడా కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్ … చంద్రబాబు అరెస్ట్ సమయం లో అండ గా నిలబడి ఒక వర్గంలో తను అంటే పడని వ్యక్తులు కూడా మనసారా ఇష్టపడేలా ఎదిగాడు… This was one of the master moves of recent decades’ AP political history.. పొత్తు దిశగా తన పార్టీ అభిమానులని కన్విన్స్ ఎలా చెయ్యాలి అనే తర్జన భర్జన సమయం లో ఈ సంఘటన అన్ని రకాలు గా సహాయ పడింది.
గురి తప్పని లక్ష్యం – తన వెంట ఉన్న వారే తన వాళ్లన్నట్లుగా పోరాటం
ఆ తర్వాత సీట్ల సర్దుబాటు నుంచి, ప్రచారం వరకు.. ఒక గాయపడిన సింహం మాదిరి పవన్ కళ్యాణ్ జగన్ని వేటాడిన తీరు 2024 ఎన్నికలని ఒక పతాక స్థాయి కి తీసుకొని వెళ్లాయి…. ఆయన అభిమానుల ఎనర్జీ కూటమి ప్రచారం లో ప్రత్యేక ఆకర్షణ అయ్యింది.. .. కాకినాడ ఇంజినీరింగ్ కాలేజి యువకులు సీఎం జగన్ ని మొఖం మీదనే ర్యాగింగ్ చెయ్యడం నుంచి, జనసేన వీర మహిళల ఉత్సాహం దాకా.. పలు రకాలు గా ఎన్నికల్లో నియంత జగన్ రౌడీ మూకలని, సోషల్ మీడియా పైడ్ రాక్షస మూకలని అద్భుతం గా ఎదుర్కున్న జన సైన్యాన్ని ఒక ఫోర్స్ గా తీర్చి దిద్దిన పవన్ కళ్యాణ్ తన అజెండా ఒక ఎన్నికలకే కాదు …. ఇది ఒక పదేళ్ల దీర్ఘ కాలిక పొత్తు టీడీపీ బీజేపీ తో అని చెప్పి …. స్థానిక ఎన్నికల్లో కూడా జనసేన కి మంచి పదవులు అందేలా చూస్తాను అని హామీ ఇచ్చారు.
వంద శాతం ఓట్ల ట్రాన్స్ ఫర్ అయ్యేలా చూసుకోవడంతోనే సరికొత్త చరిత్ర
చిరంజీవి పవన్ కళ్యాణ్ అంటే ఏడ్చే ఒక వర్గం లోని కరుడుగట్టిన వాళ్ళని కూడా తన persistance తో అభిమానులు గా మార్చుకొని… టీడీపీ జనసేన మధ్యన 100 కి 100 శాతం ఓట్ ట్రాన్స్ఫర్ జరిగేలా చూసిన పవన్ కళ్యాణ్… ఆయన ఎజెండా కి అనుగుణం గా ప్రతిస్పందించి ప్రతి అడుగులో పవన్ ని సొంత తమ్ముడు లా ఆదరించి… ప్రతి రోజు పవన్ గౌరవాన్ని పెంచేలా కృషి చేసిన చంద్రబాబు…. ఇద్దరు కలిసి…. ఒక చరిత్ర సృష్టించారు….నియంత జగన్ పై అన్ని వర్గాల్లో ఉన్న భయం, కోపం, అసహ్యం నీ ఈ ఇద్దరు నాయకుల సరైన దిశగా మళ్లించారు ఆంధ్ర రాష్ట్రం లో చరిత్ర లో ఎప్పడు లేని విధంగా ప్రత్యర్థి పై 16% ఓట్ల ఆధిక్యత తో పునాదులు కదిలిపోయేలా దెబ్బ కొట్టారు….. క్రెడిట్ కోసం పాకులాడకుండా నాయకులు కార్యకర్తలు కూడా అధినేతల్లా పరస్పర గౌరవం గా ప్రయాణిస్తే రాష్ట్రానికి , అందరికీ మంచిది.