తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న టాప్ రేంజ్ హీరోలతో సినిమా అనగానే డైరెక్టర్స్ అందరూ కూడా మొదట ఆలోచించే పాయింట్……ఈ స్టార్ హీరో నేను చెప్పినట్టు వింటాడా? నా కథలో ఉన్న క్యారెక్టర్లో ఇమిడిపోతాడా? లేక ఆ హీరో క్రియేటివ్ తెలివితేటల ఇగోతో ఫ్యాన్స్ కోసం, ఇమేజ్ కోసం అంటూ కథ, క్యారెక్టరైజేషన్లను వదిలేసి కేవలం ఆ స్టార్ హీరో డ్యాన్సులు, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్ కోసం సినిమా తీయాల్సింది వస్తందా? అనే. త్రివిక్రమ్ శ్రీనివాస్, పరుచూరి బ్రదర్స్‌లాంటి టాప్ రేంజ్ రైటర్స్‌కి కూడా ఆ ఇమేజ్‌కి తగ్గ డైలాగ్స్ రాయకతప్పదు. మరి కథనం, క్యారెక్టరైజేషన్లతో పాటు సీన్స్, డైలాగ్స్ అన్నీ కూడా కథకు అనుగుణంగానే ఉండాలని, అది కూడా గొప్పగా ఉండాలని తపించే చంద్రశేఖర్ ఏలేటి, సుకుమార్ లాంటి డైరెక్టర్స్ పరిస్థితి ఏంటి? ఏలేటి విషయం తెలియదు కానీ సుకుమార్ మాత్రం ఓ బ్రహ్మాండమైన సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసినట్టున్నాడు.
హీరోని కొత్తగా చూపించడం……అది కూడా ఆ హీరో ఫ్యాన్స్, ప్రేక్షకులే కాదు ఆ హీరో కూడా ఊహించలేనంత కొత్తగా ఆ హీరోని తెరపైన ఆవిష్కరించడం. నాన్నకు ప్రేమతో సినిమా చూసిన వెంటనే రామ్ చరణ్‌లాంటి హీరో సుకుమార్‌కి డేట్స్ ఇవ్వడానికి కారణం అదే. ఎన్టీఆర్‌లాంటి హీరో కథ కూడా వినకుండా సుకుమార్‌తో సినిమా చేయడానికి రెడీ అంటున్నాడంటే సుకుమార్‌లో ఉన్న ఆ టాలెంటే. ఆ ప్రతిభకు న్యాయం చేస్తూ ఇప్పుడు రామ్ చరణ్‌ని కూడా పూర్తిగా కొత్తగా చూపించే ప్రయత్నాల్లో ఉన్నాడు సుకుమార్. ఖైదీ నెంబర్ 150 ప్రి రిలీజ్ ఫంక్షన్‌కి వచ్చిన రామ్ చరణ్‌లో ఆ మార్పు చాలా స్పష్టంగా కనిపించింది. ధృవ సినిమాలో కూడా కొత్తగా కనిపించడానికి చాలా ట్రై చేశాడు చరణ్. కానీ మరీ అంతగా పేరు అయితే రాలేదు. అందుకే ఇప్పుడు సుకుమార్‌కి మాత్రం ఫుల్ ఫ్రీడం ఇచ్చాడని తెలుస్తోంది. మామూలుగా మెగా సినిమాలన్నింటినీ కూడా బోలెడంత మంది కలిసి వండుతూ ఉంటారు. హిట్టా, ఫ్లాపా అన్న విషయం పక్కనపెడితే కొత్తదనం మాత్రం ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు సుకుమార్‌కి మాత్రం ఫుల్ ఫ్రీడం ఇచ్చారని తెలుస్తోంది. ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా స్పెల్ బౌండ్ అయ్యే రేంజ్లో రామ్ చరణ్ మేకోవర్ ఉండాలన్నదే సుకుమార్‌కి ఇచ్చిన టార్గెట్. నాన్నకు ప్రేమతో సినిమాలో ఏ ఒక్కరూ ఊహించని విధంగా…..అద్భుతః అనే రేంజ్లో ఎన్టీఆర్‌ని చూపించిన సుకుమార్……ఈ సారి చరణ్‌ని ఇంకే రేంజ్లో చూపిస్తాడో చూడాలి. సుకుమార్‌లాంటి డైరెక్టర్‌కి పూర్తి ఫ్రీడం ఇస్తే మాత్రం హిట్ సినిమానా? ఫ్లాప్ సినిమానా అన్న కమర్షియల్ లెక్కల విషయం పక్కన పెడితే కెరీర్ మొత్తం మీద కూడా గుర్తుండి పోయే అతి కొద్ది సినిమాల్లో ఒక సినిమాను ఏ హీరోకైనా ఇవ్వగలడు సుకుమార్. ఇప్పుడు చరణ్‌తో చేయబోయే సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందనడంలో సందేహం లేదు.