తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ భవిష్యత్ లీడర్ అని..ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఒకరి తర్వాత ఒకరు వరుసగా ప్రకటనలు చేశారు. ఇలాంటి ప్రకటనలు వద్దని హైకమాండ్ చెబితే.. ఏకంగా సీఎం అవుతారనే వాదన వినిపించడం ప్రారంభించారు. నారా లోకేష్‌కు ఇప్పుడు ఎవరు పోటీ ఉన్నారు?. ఎందుకు ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నట్లుగా అందరూ వాయిస్ వినిపిస్తున్నారు ..అంటే.. అదో రకమైన విధేయత ప్రదర్శన అనుకోవచ్చు.
తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్‌కు పోటీ లేదు. చంద్రబాబు తర్వాత ఎవరు అన్న ప్రశ్న వస్తే లోకేష్ తప్ప మరో పేరు వినిపించడం లేదు. బాలకృష్ణ రేసులో లేరు. ఆయన ప్రాధాన్యాలు వేరు. ఆయన కూడా లోకేష్ కే సపోర్టు చేస్తారు. ఇక ఎవరు ఉన్నారు ?. అయినా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలి.. సీఎం అవుతారు అనే ప్రకటనలు చేయడం చేయడం యాధృచ్చికం కాదు. లోకేష్ పై విధేయతా ప్రదర్శన ద్వారా ఆయన గుడ్ లుక్స్ లో ఉండాలన్న తాపత్రయంతోనే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు.
టీడీపీ నేతల అతి వల్ల జనసేన పార్టీ నేతల్లో అసహనం కనిపిస్తోంది. నిజానికి టీడీపీ అంతర్గత విషయం. ఒక వేళ డిప్యూటీ సీఎంను చేయాలని అనుకుంటే కూటమి ప్రభుత్వం కాబట్టి అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. కానీ అసలు అలాంటి ఆలోచన ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. డిప్యూటీ సీఎం అనే హోదా ఇస్తే ప్రత్యేకంగా వపర్స్ రావు. గతంలోఐదుగురు డిప్యూటీ సీఎంలుగా ఉన్న వారి పేర్లు గుర్తుండవు.. ఇప్పుడు పవన్ పవర్ ఫుల్ డిప్యూటీ సీఎం. లోకేష్ కు ఆ హోదా లేకపోయినా పలుకుబడి ఉంది. అందుకే టీడీపీ నేతలు అవసరం లేని వివాదాన్ని నెత్తికెత్తుకుని సంబంధం లేదని టాపిక్ ను చర్చకు పెడుతున్నారు.