ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది ?. ఒకటో తేదీన జీతం ఇవ్వాలంటే ఆర్బీఐ దగ్గర పళ్లెం, గరిటె పట్టుకుని ప్రతి మంగళవారం గంట కొట్టుకోవాలి. ఒక్క జీతాలే కాదు ఏ పథకం ఇవ్వాల్సి వచ్చినా అదే. అదే సమయంలో అప్పులు ఇప్పించే వాళ్లకు కమిషన్లు ఇచ్చి మరీ.. రాష్ట్రం ఎక్కడ ఆస్తులు తాకట్టు పెట్టగలిగేవి ఉంటే తాకట్టు పెట్టి తెచ్చుకునే అప్పుల ప్రయత్నాలు ఇంకో వైపు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులన్నీ ఇప్పటికీ తాకట్టు పెట్టేశారు. మొత్తం జీవోలన్నీ రహస్యంగా ఉంచారు. అవన్నీ బయటకు వస్తే ఎన్ని ఆస్తులు ఆమ్మేశారో..ఎన్ని తాకట్టు పెట్టారో ఓ క్లారిటీ వస్తుంది.
టీడీపీ పథకాలు అమలు చేయాలంటే సంపద పెంచాల్సిందే !
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య పరిస్థితి దౌర్భాగ్య స్థితికి చేరింది. వచ్చే ప్రభుత్వానికి అప్పులు, తాకట్టు అనే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే గరిష్టంగా ప్రస్తుత ప్రభుత్వమే అన్నీ చేసేసింది. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం సంపద సృష్టించాలి. ఆ సంపదనే ప్రజలకు పంచాలి. అంతే కానీ.. వారి దగ్గర పన్నులు పిండుకుంటాం.. వారి ఆస్తులను కూడా తాకట్టు పెట్టుకుంటాం అంటే సాధ్యమయ్యే పని కాదు. సంపద సృష్టి చేతనైన నాయకుడికే పథకాలు అమలు చేసే సామర్థ్యం ఉంటుంది. ఆ విషయంలో చంద్రబాబు ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన పని లేదు.
ఏరీ ఆర్థిక పునాదుల్ని పెకిలించేసిన సీఎం జగన్
ఐదేళ్ల కిందట లక్ష రూపాయల ఆదాయం ఉంటే.. ఇప్పుడు లక్షన్నర ఉండాలి. అలా ఉంటే జీతం పెరిగినట్లుగా కాదు. ద్రవ్యోల్బణంకు తగ్గట్లుగా ఆదాయం సమాన స్థితికి చేరినట్లు. అంత కంటే ఎక్కువగా ఉంటే.. సంపదను సృష్టించుకున్నట్లు. దురదృష్టవశాత్తూ ఏపీలో ఐదేళ్ల కిందట ఉన్న ఆదాయం కూడా లేదు. పన్ను రేట్లతో పోలిస్తే తగ్గిపోయింది. స్వల్ప పెరుగుదల చూపిస్తున్నప్పటికీ అది కేవలం రేట్ల పెరుగుదల వల్ల కనిపిస్తున్నదే తప్ప.. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుదల వల్ల కాదు. దేశంలో మధ్యతరగతి ప్రజల ఆర్థిక వాహకం లాంటి ద్విచక్ర వాహన అమ్మకాలే సాక్ష్యం.
సంపద సృష్టిలో చంద్రబాబుది ప్రత్యేక బ్రాండ్ !
ఏపీలో ఆస్తుల అమ్మకాలు.. కొనుగోళ్లు జరగాలంటే.. మొదటగావినిపిస్తున్న మాట. చంద్రబాబు వస్తే.. జగన్ మళ్లీ వస్తే. ఈ రెండు అంశాల ప్రాతిపదకినే లావాదేవీలు జరుగుతున్నాయి. చంద్రబాబు గెలిచే వాతావరణం ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ భూములు కొని పెట్టుకుంటే… ఏడాది తర్వాత రెట్టింపు అవుతాయని కొంత మందిపెట్టుబడులు పెడుతున్నారు. అదే సమయంలో పొరపాటున జగన్ మళ్లీ వస్తే కొన్న దాంట్లో సగం రేటు కూడా ఉండదనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఆస్తులు అమ్ముకుని కష్టాలు తీర్చుకుందామనుకుంటున్న వారు కూడా చంద్రబాబు గెలిచిన తర్వాత చూద్దాం అనే స్థితికి చేరారు. ఇదే సంపదసృష్టి. అందుకే చంద్రబాబు .. పథకాలను సంపద సృష్టించి అమలు చేయగలరన్న నమ్మకంతో ఉన్నారు.