ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఒక్కటంటే ఒక్క రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడటానికి కనీసం నోరెత్తలేనంత నిస్సహాయ స్థితికి చేరిపోయింది. స్టీల్ ప్లాంట్ బిడ్ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూస్తే… ఇంత అదికారం ఇచ్చిన ప్రభుత్వం ఇంత ఘోరంగా నిస్సహాయత చూపిస్తోందని ప్రజలు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెచ్చిపోయారే !
వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా దూకుడుగా రాజకీయాలు చేసింది. ప్రత్యేక హోదా కోసం ఊరూవాడా దీక్షలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రంపైనా విమర్శలు చేసేవారు. తనకు అధికారం ఇస్తే కేంద్రంలో ఎల్లయ్య ఉన్నా.. పుల్లయ్య ఉన్నా మెడలు వంచుతానని ప్రకటించేవారు. తీరా అధికారంలోకి వచ్చాక ఢిల్లీ వెళ్లిన తర్వాత తొలి సారి మీడియాతో మాట్లాడినప్పుడు బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉందని.. ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలుకుంటామని ప్రకటించారు. అప్పట్నుంచి ఏ విషయంలోనూ కేంద్రంపై పోరాడిన సందర్భమే లేదు. ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలుకున్నందుకు ఏపీకి రావాల్సిన వాటిని ఇచ్చారా అంటే అదీ కూడా లేదు.
కేంద్రంపై గట్టిగా ఒక్క మాట మాట్లాడితే జైలుకేనని భయం..భయం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలోనూ కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితిని వైఎస్ఆర్సీపీ ఎదుర్కుంటోంది. ప్రైవేటీకరణ వద్దని కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా అభిప్రాయం చెప్పలేకపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కోసం బిడ్ దాఖలు చేయడానికి ముందుకు వచ్చింది. ఇలా ఈ విషయం తెలియగానే అందరూ ఏపీ ప్రభుత్వంపై వైపు చూశారు. దీంతో ప్రభుత్వానికి సమాధానం చెప్పక తప్పలేదు. స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనలేమని.. కేంద్రంపై పోరాడలేమని.. వినతి చేయగలమని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు . కేంద్రంతో విబేధిస్తే ఎక్కడ జైలుకెళ్లాల్సి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు.
ఏపీని సాంతం నాకించేసిన జగన్ అధికారం !
కేంద్రానికి పూర్తి మెజార్టీ ఉందని మన అవసరం లేదు కాబట్టి పోరాడలేమని ప్రభుత్వం చెబుతోంది. అది నిజం కాదు. లోక్ సభలో కేంద్రానికి మెజార్టీ ఉంది. కానీ.. రాజ్యసభలో లేదు. అనేక కీలక బిల్లులు ఓటింగ్ కు వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ బేషరతుగా మద్దతు తెలిపింది. ఈ పార్టీ మద్దతే కీలకం అయింది. అయితే ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రయోజనాలతో ఈ మద్దతు ముడిపెట్టలేదు. అందుకే పోలవరం ప్రాజెక్టు నాలుగేళ్లుగా ఎక్కడిదక్కడే ఉంది. చివరికి ఇక ఆ ప్రాజెక్టుకు నిధులిచ్చేది లేదని అంటున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఎంత దారుణం అంటే చివరికి ఏపీకి రావాల్సిన గ్రాంట్లను కూడా తెచ్చుకోలేకపోతున్నారు. అప్పులకు అనుమతులు తెచ్చుకుని అదే పెద్ద అచీవ్ మెంట్ అనుకుంటున్నారు.