తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు ఇప్పుడు ఆనం బ్రదర్స్‌లో ఒకరైన రమణారెడ్డి పెద్ద ఎసెట్ అయిపోయారు.. నెల్లూరు స్లాంగ్‌ను వంద శాతం ప్రయోగిస్తూ ఆనం వెంకట రమణారెడ్డి వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఆయన తిట్టేవి తిట్లే. కానీ నెల్లూరు స్లాంగ్‌లో అవి తిట్లు కావు. రొటీన్ భాష. సీఎం జగన్‌కు ఆయన హాఫ్ టిక్కెట్ అని పేరు పెట్టారు. ఆ పేరుతోనే పిలుస్తూంటారు. ఇతర వైసీపీ నేతలకూ అలాంటివే పెట్టారు. ఇటీవల ఆనం వెంకటరమణారెడ్డి దాదాపుగా ప్రతీ రోజూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఆయన మాటతీరు అందర్నీ ఆకట్టుకుంటూడటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆయన ప్రెస్ మీట్లో వీడియోలను సోషల్ మీడియాలో టీడీపీ నేతలు విపరీతంగా సర్క్యూలేట్ చేసుకుంటున్నారు. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆయన తిట్టే తిట్లు కూడా విచిత్రంగా ఉంటున్నాయి. ఆనం వివేకానందరెడ్డిని గుర్తు చేస్తున్నారని ఎక్కువ మంది అంటున్నారు. కానీ ఆనం వివేకా కన్నా ఎక్కువగా నాటకీయత ఆనం రమణారెడ్డి డైలాగ్ ఎక్స్ ప్రెషన్లో ఉంటోంది. ఆయన విమర్శలు వైరల్ అవుతూండటంతో ఇటీవల వైసీపీ నేతలు ఆయనను ట్రోల్ చేయాలనుకుంటున్నారు. కానీ ఆనం బ్రదర్ దీన్ని మరింత పాజిటివ్‌గా తీసుకుని తిట్లతో రెచ్చిపోతున్నారు.
వైసీపీ సోషల్ మీడియా ఆయనకు నల్లబాలు అని పేరు పెట్టింది. అవున్రా..నేను నల్లగానే ఉన్నాను.. నల్లబాలునే.. మరి మీ సీఎం ఏ కలర్రా అని ఆయన ప్రశ్నించడం వైరల్‌గా మారింది. తనకు ఫోన్ చేసి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తారా అని అడుగుతున్నారని.. ఆ వృత్తిని కూడా జగన్ లాగేసుకున్నారని.. ఆయననే అడగాలని చెబుతున్నానని కౌంటర్ ఇస్తున్నారు. ఆయన విమర్శలు వైసీపీ నేతలకు సూటిగా గుచ్చుకుటంున్నాయి. ఎలా రియాక్ట్ అయితే.. ఏం అంటాడోనని వారు కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.
ఆనం వివేకా, ఆనం రామనారాయణ ఇద్దరూ ఓ జట్టుగా రాజకీయాలు చేసేవారు. వారికి మరో ఇద్దరు సోదరులు ఉన్నారు. వారితో పడేది కాదు. వేర్వేరు పార్టీల్లో ఉండేవారు. ఇప్పుడు ఆనం వెంకటరమణారెడ్డిటీడీపీలో ఉన్నారు. జగన్‌పై విరుచుకుపడుతున్నారు. ఆయనకు గతంలో ఎప్పుడూ రానంత గుర్తింపు ఇప్పుడు టీడీపీలో లభిస్తోంది.