చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు. పైసా కూడా వారి దగ్గర నుంచి తీసుకోడు. అదొక్కటేనా .. ఆ కుటుంబానికి ఎలాంటి కోరికలు కావాలన్నా ఆయన తీర్చేస్తాడు. ఎన్నికల్లో ఖర్చులకు బీఆర్ఎస్కు సాయం చేస్తాడు.. తాను ఎంపీగా తన కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంతైనా ఖర్చు పెట్టగలరు. మరి చెవిరెడ్డి ఎలా సంపాదిస్తాడు అంటే చాలా మంది ఎర్రచందనం దగ్గర్నుంచి చాలా చెబుతారు. కానీ ఆధారాలు మాత్రం ఉండవు.
కానీ టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి చెవిరెడ్డి బిజినెస్లలో ఒకదాన్ని బయట పెట్టారు. అదేమిటంటే.. శ్రీవారి దర్శన వ్యాపారం. టీటీడీ సభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాసిన 54 బ్రేక్ దర్శనం టిక్కెట్లను, వారికి వసతిని మంజూరు చేయాలని ఒక్క సిఫారసు లేఖ మీదరాసి పంపించారు. ఇది ఒక్క లేఖ మాత్రమే. వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లను వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీవారి ట్రస్ట్ ద్వారా పది వేలకు అమ్మడం ప్రారంభించారు. టిక్కెట్ ధర ఐదు వందలే అయినప్పటికీ శ్రీవాణి ట్రస్ట్ కు పదివేల విరాళం ఇస్తే ఆ టిక్కెట్ అమ్ముతారు. దాని ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం తో పాటు వసతి కల్పిస్తారు.
ఇప్పుడు చెవిరెడ్డి ఇలా యాభై నాలుగు మందికి ఉచిత బ్రేక్ దర్శనం కల్పించాలని సిఫారసు చేయడం వల్ల.. ఐదు లక్షల నలబై వేల రూపాయలు లాస్ అవుతాయి. ఇవన్నీ చెవిరెడ్డి వసూలు చేశారు. ఇది ఒక్క లేఖే .. గత ఐదేళ్లుగా ఎన్నిసార్లు రాసి ఉంటారో చెప్పాల్సిన పనిలేదరు. మంత్రిగా ఉన్నప్పుడు రోజా కూడా దాదాపుగా ప్రతి వారం శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆమెతో పాటు కనీసం పాతిక నుంచి యాభై మంది స్పెషల్ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ లెక్కన రోజా ఎంత వెనకేశారో ? .