రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (అనంత్ అంబానీ- రాధిక) మరో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ ఏడాది మార్చిలో జామ్ నగర్ లో గ్రాండ్ గా నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ గురించి ఇంకా చర్చ నడుస్తుండగానే మరో ఈవెంట్ ను ప్లాన్ చేసింది అంబానీ ఫ్యామిలీ.
రెండో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ఈ నెల 28 వ తేదీ నుంచి 30వరకు జరగనుంది. మొదటి ప్రీ వెడ్డింగ్ ను ఔరా అనే స్థాయిలో నిర్వహించిన అంబానీ ఫ్యామిలీ ఇప్పుడు అంతకుమించిన లెవల్ లో సెకండ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మూడు రోజులపాటు ఏయే రోజున ఎలాంటి ఈవెంట్స్ చేయాలనేది ముందస్తుగా ప్లాన్ చేశారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు బాలీవుడ్, క్రీడా, రాజకీయ రంగ ప్రముఖులు ఇటలీకి బయల్దేరారు.
ఈసారి ఎవరూ ఊహించని విధంగా ఏకంగా సముద్రంలో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. సముద్రం మధ్యలో క్రూజ్ షిప్ లో ఈ ఈవెంట్ జరగబోతోంది. క్రూజ్ షిప్ ఇటలీలోని సిటీ పోర్ట్ నుండి స్టార్ట్ అయి దక్షిణ ఫ్రాన్స్‌లో ప్రయాణాన్ని ముగిస్తుంది. మూడు రోజుల పాటు ఈ క్రూజ్ మొత్తంగా 4,380 కిలోమీటర్ల ప్రయాణం చేయనున్నట్టు తెలుస్తోంది.