జుగుప్సాకరంగా ఓ మహిళతో వ్యవహరిస్తూ … నగ్నంగా వీడియో కాల్లో దొరికిన న్యూడిస్ట్ ఎంపీని సేవ్ చేయడానికి అనంతపురం పోలీసులు ఓ కథ రాసుకొచ్చి చెప్పారు. గత మూడు రోజులుగా వైసీపీ నేతలు.. మంత్రులు.. సజ్జల వంటి ” ముందు చూపు” కలిగిన వ్యక్తులు చెబుతున్నదే ఎస్పీ ఫక్కీరప్ప చెప్పారు. అసలు ఆ వీడియోలో ఉన్నది మాధవో కాదో చెప్పలేమని ప్రారంభించి.. వైసీపీ నేతలు వివిధ సందర్భాల్లో చెప్పిన పాయింట్లన్నింటినీ చెప్పారు. మొదట ఈ వీడియో ఆగస్టు నాలుగో తేదీన తెల్లవారుజామున రెండు గంటలకు ఐ టీడీపీ అఫీషియల్ అనే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ అయిందన్నారు. అంతకు కొద్ది సేపటి ముందే ఆ గ్రూప్‌లో యాడ్ చేసిన యూకే నెంబర్ ద్వారా ఆ వీడియో పోస్ట్ చేశారు.
అది విదేశాలకు చెందిన నెంబర్ కనుక.. ఆ వ్యక్తి ఎవరో కనుగొనేందుకు తదుపరి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ ప్రకటించారు. గోరంట్ల మాధవ్ అభిమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము దర్యాప్తు జరిపామని అది ఒరిజినల్ వీడియో కాదని గుర్తించామన్నారు. ఒకరు వీడియో చూస్తూంటే.. మరొకరు ఆ వీడియోను ఫోన్లో చిత్రీకరించారన్నారు. ఆ తర్వాత ఆ వీడియోను అనేక సార్లుగా ఫార్వార్డ్ చేయడం వల్ల అది ఒరిజినలో కాదో గుర్తించలేకపోతున్నామన్నారు. ఆ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండవచ్చని ఎస్పీ ఫక్కీరప్ప అనుమానం వ్యక్తం చేశారు. ఒరిజినల్ వీడియో ఇంత వరకూ లభించలేదన్నారు. ఒరిజినల్ వీడియో సోర్స్ ఉంటనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగలమన్నారు.
పైగా ఈ వీడియో వ్యవహారంపై బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. వీడియోలో ఉన్నది ఎవరన్నది కూడా చెప్పలేమని ఎస్పీ తేల్చేశారు. ఎంపీ మాధవ్ ఇంత వరకూ తమకు ఫిర్యాదు ఇవ్వలేదన్నారు. ఒక వేళ బాధితులు ఫిర్యాదు చేస్తే ఎంపీ ఫోన్‌ను పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. పోలీసుల చెప్పిన వివరాలు సహజంగానే ప్రజలను ఆశ్చర్య పరుస్తాయి. పోలీసుల నీతి నిజాయితీ గురించి చర్చకు కారణం అవుతాయి. అయితే ఇలాంటి పోలీసు దర్యాప్తులు ఏపీలో కామన్ అయిపోయాయి. అందుకే పోలీసులు ఏం చెబుతారన్నదానిపై ఎవరూ పెద్దగా డౌట్స్ పెట్టుకోలేదు. కానీ పోలీసు వ్యవస్థ గౌరవాన్ని కాస్తంతైనా కాపాడుతారేమోనని కొంత మంది ఆశపడ్డారు. వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.