సొంత బాబాయ్ ని హత్య చేసినట్లుగా కేసులు ఎదుర్కొని కోర్టుల చుట్టు తిరుగుతూ… సొంత బంధువులతో ఛీ కొట్టించుకుంటున్న వారు ఒకరు, దళితుడ్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసి ఊరేగుతున్న వారు మరొకరు.. .వీరిద్దరూ కలిసి వైసీపీయిజాన్ని రాష్ట్రం మొత్తం ప్రత్యేకంగా చాటుతున్నారు. రోజూ వీరి వ్యవహారాలే హైలెట్ అవుతున్నాయి వైసీపీ లో ఇలాంటి వాళ్లకు మాత్రమే భవిష్యత్ ఉంటుందని .. వాళ్లను గెలిపిస్తే.. ప్రజలకు భవిష్యత్ ఉంటుందా అని గుసగుసలాడుకుంటున్నారు.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి గురించి చర్చ జరగని రోజు లేదు. సునీత, షర్మిల ఇద్దరూ ప్రతీ రోజూ.. అవినాష్ రెడ్డి గురించి చెబుతున్నారు. ఆయన ప్రతీ వారం కోర్టుకు హాజరు కావాల్సి వస్తోంది. మరో వైపు సాక్షుల్ని బెదిరించిన వ్యవహారంలో బెయిల్ రద్దు పిటిషన్ హైకోర్టులో ఉంది. రద్దు చేయాల్సిందేనని.. సాక్షుల్ని బెదిరించినట్లుగా సాక్ష్యాలు ఉన్నాయని సీబీఐ సైతం స్పష్టం చేసింది. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్త చర్చ జరుగుతోంంది.
ఇక మరో వైపు అనంతబాబు వ్యవహారం కూడా అదే స్థాయిలో రచ్చ అవుతోంది. ఆయన ఏ ఊరికి వెళ్లినా దళితులు వెంట పడుతున్నారు., కొత్తగా ఆయన రంపచోడవరం కాకుండా.. ప్రత్తిపాడులో కూడా వేలు పెడుతున్నారు. అక్కడ తన సమీబ బంధువు అయిన వరుపుల సుబ్బారావుకు టిక్కెట్ ఇప్పించుకుని ఆయన వయసు కారణంగా మొత్తం తానే చక్క బెడుతున్నారు. గ్రామాల్లోకి వెళ్తే అక్కడి జనం తరిమికొడుతున్నారు. ఈ వీడియోలు వైరల అవుతున్నాయి.
గిరిజన ప్రాంతాల్లో పోలీసులతో ఆయన భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. అయినా తిరగబడేవారు ఎక్కువ కావడంతో పరారు కావాల్సి వస్తోంది. నిజానికి అనంతబాబు ను వైసీపీ సస్పెండ్ చేసింది. కానీ ఉత్తుత్తినే. ఇలా కూడా మోసం చేయవచ్చని వైసీపీ అధినేత ప్రజలకు చూపిస్తున్నారు.