తన వీడియో మార్ఫింగ్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో గోరంట్ల మాధవ్ కూడా అదే చేశారు. అప్పుడు సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ రంగంలోకి దిగి అది ఫేక్ వీడియో అని స్వయం సర్టిఫికెట్ ఇచ్చేశారు. కానీ ఇప్పుడు అలాంటి పోలీసులు లేరు. గుట్టు బయటపెడతారు. తన వీడియో సర్క్యూలేట్ అవుతూండటంతో తనది కాదని చెప్పుకోవడానికి హడావుడిగా కేసు పెట్టారు అనంతబాబు.
అనంతబాబు తన ఫిర్యాదులో అలాంటి వీడియో ఒకటి తన దగ్గర ఉందని కొంత కాలంగా ఓ వ్యక్తి బెదిరిస్తున్నరని పేర్కొన్నారు. అంటే ఆ వీడియో నిజమేనని ఆయన పరోక్షంగా అంగీకరించినట్లే. అలాంటి పనులు ఎవరితో చేశాడో వారే రికార్డు చేసి.. అతన్ని బెదిరిస్తూ ఉండాలి. ఇప్పుడు పోలీసులు ఈ వ్యవహారం బయటకు తీస్తే.. అనంతబాబుకు అసలు షాక్ తగిలే అవకాశం ఉంది.
డ్రైవర్ హత్య కేసులో పోలీసులు సరైన సమయంలో చార్జిషీట్ వేయకపోవడం వల్లనే సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ వచ్చింది. లేకపోతే ఇప్పటికీ జైల్లోనే ఉండేవారు. ఇప్పుడు ప్రభుత్వం అనంతబాబు వ్యవహారాలన్నింటినీ బ యటకు తెచ్చేందుకు ఆయన చేసిన ఫిర్యాదునే ఆధారంగా చేసుకుని పోలీసులతో దర్యాప్తు చేయించే అవకాశం ఉంది. మన్యంలో అరాచకశక్తిగా మారిన అనంతబాబు తనకు తానే గడ్డు పరిస్థితి తెచ్చుకున్నారని అనుకోవచ్చు.