గీత రచయిత అనంత శ్రీరామ్ మరీ ఊగిపోయే స్పీచులు ఇవ్వడం వుండదు. ఐతే కర్నూల్ లో సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రేషన్స్ లో మాట్లాడిన అనంత్ పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. మహేష్ అభిమానులని సింహలతో పోల్చారు. తాను రాసిన ‘ చెప్పకురా తోలు తొక్క. తప్పదు నా వడ్డీ లెక్క” పాటలానే ఇదు రోజుల్లోనే అసలు మొత్తం వసూళు చేసి, వడ్డీ మీద బారు వడ్డీ దానిమీద చక్రవడ్డీ సినిమా వసూళు చేసుకుంటూ సర్కారు వారి పాట దూసుకుపోతుందని అన్నారు. అభిమానులు గర్జనలు చూస్తుంటే ఈ విజయం ఇక్కడితో ఆగేలాలేదని ఆవేశంగా మైక్ పట్టుకొని ఊగిపోయారు అనంత్ శ్రీరామ్. ఇక్కడే యూట్యూబ్ థంబ్ లైన్స్ పై కూడా ఒక సెటైర్ వేశారు. థంబ్ లైన్స్ సర్కారు వారి పాట ని టచ్ చేయలేవని మాస్ డైలాగ్ పేల్చారు అనంత్. సర్కారు వారి పాటకు మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదిక ఈ సినిమాపై కొంచెం నెగిటివ్ టాక్ నడిచింది. ఇదే అంశాన్ని పరోక్షంగా ప్రస్థావించారు అనంత్ శ్రీరామ్.