హైందవ శంఖారావంలో గీత రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. హైందవ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తున్నారని ఆరోపించారు. పలు సినిమాలను ప్రస్తావించారు. ఆయన మాటలు వినిపించి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే…పనే దైవం అంటారు పెద్దలు. ఎందుకంటే కడుపు నింపేది పని. ఆ పని ఇచ్చిన పరిశ్రమను కడుపు నిండిన తర్వాత తప్పుడు పడిదే దైవాన్ని తప్పు పట్టడమే అంటారు. కానీ ఇక్కడ అనంత శ్రీరామ్ అదేమీ అనుకోలేదు. ఇండస్ట్రీ మీద రాళ్లేశారు. ఫలానా వాళ్లు తప్పు చేశారని నిందించేశారు. ఇలా చాలా సులువే. కానీ స్పందించకూడని వేదిక మీద స్పందించారు.
సినిమా ఇండస్ట్రీ అంటేనే తమ భావాలను స్వేచ్చగా ప్రకటించే రంగం. అనంత శ్రీరామ్ కూడా తన భావాలను అలాగే ప్రకటించారు. ఆయన భావాలను అందరూ అంగీకరించాలని ఉండదు. వ్యతిరేకించాలని ఉండదు. అలాగే సినిమా స్టోరీలు కూడా కాల్పనికం. ఫలానా విధంగా ఉండాలని ఎవరూ తీర్మానించలేరు. కల్కి వచ్చిన తర్వాత కర్ణుడి విషయంలో చాలా చర్చలు జరిగాయి. జరుగుతున్నాయి. అంత ఎందుకు రాక్షసుల్ని మంచివారిగా చూపించే సినిమాలు వచ్చాయి. కొంత మంది నమ్ముతున్నారు కూడా. ఇది హైందవంపై దాడి ఎలా అవుతుంది ?
నిజమైన హైందవం ఎవర్నీ ద్వేషించదని పెద్దలు చెబుతారు. ఒకరిపై వ్యతిరేకతను.. తమకు అందులో పాటలు రాసే అవకాశాల్ని ఇవ్వలేదనో.. తనను గుర్తించలేదనో నిందల్ని వేయడం సమంజసం కాదు. బతుకునిచ్చిన ఇండస్ట్రీ మీద చాలా సులువే. కానీ అలా చేయడం.. మంచిదా కాదా అని .. రాళ్లేసేవాళ్లే ఆలోచించుకోవాలి. ఆ ఇండస్ట్రీ లేకపోతే మనకు అక్కడ నిల్చుని ప్రసంగించే అవకాశం కూడా రాదని ఎందుకు ఆలోచించలేకపోతున్నారో మరి !