యాంకర్ అనసూయ కొత్త వివాదంలో పడింది. తనతో కలిసి ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించిన బాలుడి ఫోన్ను పగలగొట్టింది. దీనిపై ఆ బాలుడి తల్లి కేసు కూడా పెట్టింది. ఐతే ఈకేసుపై వివరణ ఇచ్చింది అనసూయ.
”ఇది పూర్తిగా తప్పు. మా అమ్మను చూడటానికి తార్నాకకు వెళ్లా. నేను బయటికి వస్తుండగా ఆమె తన కుమారుడితో కలిసి నా వీడియో తీశారు, నాతో సెల్ఫీకి ప్రయత్నించారు. నేను అప్పుడు సెల్ఫీ దిగే పరిస్థితిలో లేను, అందుకే తిరస్కరించా. కెమెరా దగ్గరికి పెట్టేసరికీ కంగారుపడ్డా. నా ముఖం కప్పుకున్నా, ఇక్కడి నుంచి వెళ్లండి అని వారికి చెప్పి కారులో కూర్చొన్నా. అప్పుడు ఫోన్ పగిలిందా? లేదా? అన్న విషయం నాకు గుర్తులేదు. ఆమె ఫోన్ పగిలినందుకు క్షమాపణలు చెబుతున్నా. కానీ నేను చేయని తప్పుకు నన్ను నిందించడం సరికాదు. నా ప్రైవసీ నాకు ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది అనసూయ.