ఐదు అంటే ఐదు వరాలు కూడా కాలేదు… సోషల్ మీడియా మీద చిరాకుతో మళ్ళీ ఈ ఫ్లాట్ఫామ్లోకి ఇప్పట్లో రాను అని ‘రంగస్థలం’లో రంగమ్మత్త అలియాస్ అనసూయ శపథం చేసి! మొండిపట్టు వీడి మళ్ళీ వచ్చేసింది. అసలే సోషల్ మీడియాకు అలవాటు అయిన ప్రాణం… ఎన్నాళ్ళు యాప్స్ డిలీట్ చేసి చేతిలో సెల్ లేకుండా ఖాళీగా కూర్చునేది. అందుకే వచ్చేసింది. రంగమ్మత్త లుక్ ట్వీట్ చేస్తూ ట్విట్టర్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
అసలు అనసూయ ట్విట్టర్‌కు ఎందుకు టాటా చెప్పిందనే వివరాల్లోకి వెళితే… మొన్న ఫిబ్రవరిలో ఓ చిన్నారి సెల్ఫీ అడిగినందుకు ఫోన్ పగలగొట్టిందని వార్తలు వచ్చాయి కదా! అప్పుడు నెటిజన్లు ట్విట్టర్లో విమర్శలతో విరుచుకు పడితే కోపంతో టాటా చెప్పేశారు. చెబుతూ చెబుతూ ‘నేను సోషల్ మీడియాలో వుండడానికి తగిన అర్హత ఆ ఫ్లాట్‌ఫామ్‌కి లేదు’ అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కట్ చేస్తే… జనాలు ఆ వార్తను మర్చిపోయారు. ఈలోపు ‘రంగస్థలం’ విడుదలకు సిద్ధమైంది. సినిమాకి మంచి క్రేజ్ వస్తుంది. అందులో రంగమ్మత్త పాత్ర చేసిన అనసూయ, దానికి వస్తున్న క్రేజ్ క్యాష్ చేసుకుంటూ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేసింది. అదండీ సంగతి.
Meet Rangammattha 🙂 pic.twitter.com/Xid0beZE24
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 19, 2018