ట్విట్టర్ దెబ్బ అనసూయకు గట్టిగా తగలడంతో టాటా చెప్పేశారు. సోషల్ మీడియా నుంచి బయటకు రావాలని డెసిషన్ తీసుకున్నారు. టాటా చెబుతూ చెబుతూ “సోషల్ మీడియాలో జనాలకు హృదయం లేదు. వాళ్లకు బ్రేకింగ్ న్యూసులు కావాలంతే” అని కామెంట్ చేశారు.
“వ్యక్తుల జీవితాలు వారి సొంతం. పబ్లిక్‌లోకి వస్తే ఏమైనా అంటాం. ఏదైనా అంటాం” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఈ విషయం అనసూయకూ తెలుసు. ఎవరో నలుగురు ట్విట్టర్లో తిట్టినందుకు సోషల్ మీడియాకు టాటా చెప్పడం అభిమానులను హర్ట్ చేసింది. అనసూయకు ఈ తిట్లు కొత్త కాదు. ‘అర్జున్‌రెడ్డి’ ఇష్యూలో, అంతకు ముందు కొన్ని విషయాల్లో స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పినందుకూ విమర్శలు ఎదుర్కొంది. కానీ, సెల్ఫీ అడిగినందుకు చిన్నపిల్లాడి ఫోన్ పగలగొట్టిందని న్యూస్ రావడంలో ట్విట్టర్లో జనాలు అనసూయపై విరుచుకుపడ్డారు. దాంతో టాటా చెప్పేశారు.
“అనసూయ పబ్లిక్ ఫిగర్. ప్రజలకు ఆమె తెలుసు. బట్, ఎక్కడ బడితే అక్కడ ఏ టైములో పడితే ఆ టైములో ఫోటోలు తీసుకోవడానికి.. షీ ఈజ్ నాట్ పబ్లిక్ ప్రాపర్టీ. నాకూ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి. అవి అర్థం చేసుకోకుండా విమర్శలు చేస్తున్నారు. ఇప్పట్లో సోషల్ మీడియాలోకి మళ్ళీ రాను” అని అనసూయ ఘాటుగా స్పందించింది.