సూయ… సూయ.. అనసూయ అంటూ ఐటెమ్ సాంగ్ అదిరిపోతోంది.. విన్నర్ ఆల్బమ్‌లో. ఆ పాటకు కిక్కిచ్చిందే అనసూయ. తాను లేకపోతే.. ఆ పాటే ఉండేది కాదు. కేవలం అనసూయని దృష్టిలో ఉంచుకొన్నారు కాబట్టే, సూయ సూయ అనే లిరిక్‌తో పాట మొదలెట్టాడు తమన్. ఆ పాటకు సుమ గాత్రదానం అందించడంతో మరింత లుక్ వచ్చేసింది. సోగ్గాడే చిన్నినాయన తరవాత ఎంత మంది ఐటెమ్ సాంగులు చేయమని అడిగినా నో చెప్పిన అనసూయ, ఏరి కోరి విన్నర్ సినిమాకే ఎలా చేసిందబ్బా?? అంటూ ఆశ్చర్యపోయారంతా. ఈ పాట కోసం అనసూయ కాస్త బరువు కూడా పెరిగిందట. పారితోషికం కోసమే ఈ పాట ఒప్పుకొందని, అందుకే తన గ్లామర్ దెబ్బతింటుందని తెలిసినా బరువు పెరిగిందని చెప్పుకొన్నారు. అయితే.. అసలు ట్విస్టేంటంటే.. ఈ ఐటెమ్ పాటకు సంబంధించిన పారితోషికం అనసూయకు పూర్తిగా అందలేదు.
పాటకు రూ.20 లక్షలు ఇస్తానని ముందు ఒప్పందం జరిగింది. అడ్వాన్స్‌గా రూ.12 లక్షలు ముట్టజెప్పారట. మరో 8 లక్షలు బాకీ పడిపోయింది నిర్మాణ సంస్థ. దానికి తోడు మూడు రోజుల్లో అవ్వాల్సిన పాటని కాస్త 5 రోజులు సాగదీశారు. ఆ రెండు రోజులకు గానూ ఎగస్ట్రా పేమెంట్ చేస్తానని నిర్మాతలు చెప్పారట. సరే.. పాట లేటయిన కొద్దీ డబ్బులు బాగా ముడతాయని… ఫుల్లుగా కోపరేషన్ చేసేసింది. తీరా చూస్తే.. ఆ డబ్బులూ రాలేదు. దాంతో… నిర్మాతల చుట్టూ తిరుగుతోందట అనసూయ. పబ్లిసిటీలో మాత్రం తనని పూర్తిగా వాడేస్తున్నారని, పారితోషికం విషయంలో మాత్రం అన్యాయం చేస్తున్నారని తన సన్నిహితుల దగ్గర వాపోతోందట అనసూయ. ఇక మీదట టీవీ ఛానళ్ల ప్రమోషన్లకు పిలిస్తే.. ‘బాకీ తీర్చాకే వస్తా..’ అని చెబుదామని డిసైడ్ అయిపోయిందట. అదీ.. సూయ.. సూయ వెనుక ఉన్న స్టోరీ.