https://www.youtube.com/watch?v=ZVtZUylxfXI&feature=youtu.be
తప్పులెవరైనా చేస్తారు. కానీ దాన్ని ఒప్పుకొనే ధైర్యం ఉండాలి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన యాంకర్ ప్రదీప్… ఈరోజు ఓ వీడియో విడుదల చేశాడు ధైర్యంగా. తను తప్పించుకుని తిరగడం లేదని, కోర్టు పద్ధతులన్నీ పాటిస్తానని చెప్పడానికే ఈ వీడియో విడుదల చేసినా – ‘నేను తప్పు చేశాను. నాలా మీరెవరూ తప్పు చేయకండి’ అని చెప్పుకోవడానికి కూడా ఇదే వీడియోని అవకాశంగా చేసుకున్నట్టైంది. ప్రదీప్ ఎప్పుడైతే దొరికేశాడో.. అప్పుడు మరో వీడియో బాగా వైరల్ అయ్యింది. తాగి రోడ్లపై రాకండి.. అంటూ అప్పుడెప్పుడో ప్రదీప్ చేసిన ఓ వీడియో షేర్ చేసి.. ఎటకారాలు చేసుకున్నారు. ఆ వీడియో గురించి కూడా ప్రదీప్ ప్రస్తావించాడు. ‘నేను చెప్పిన విషయాలు దురదృష్టవశాత్తూ పాటించలేకపోయా’ అంటూ తన బాధని వెళ్లగక్కుకున్నాడు. మొత్తానికి ప్రదీప్ వీడియో ఇప్పుడు అతనిలోని పాజిటీవ్ యాంగిల్ ని బయటపెట్టేలా చేసింది. ఈరోజు ప్రదీప్ కౌన్సిలింగ్‌కి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు న్యాయ స్థానం ముందుకు వెళ్లొచ్చు. కనీసం ప్రదీప్‌కి మూడు నుంచి ఏడు రోజుల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.