మన కథానాయికలు వీర ఫాస్ట్. ఒకట్రెండు సినిమాలు చేస్తారో లేదో – తెలుగు సినిమా ఎత్తు బరువు లోతు కొలిచేస్తుంటారు. చేసిన ఏ పనినైనా సమర్థించుకొనే తెలివి తేటలు పెరిగిపోతుంటాయి. హాట్ యాంకర్ భామ రేష్మి కూడా.. తెలుగు మీడియా ముందు ఎలా మాట్లాడాలి? అనే విషయం బాగా బోధపడినట్టుంది. చిలక పలుకులు పలికే రష్మి… ఇప్పుడు ఘాటుగానే సమాధానం ఇస్తోంది.
ఇటీవల గుంటూర్ టాకీస్‌లో రెచ్చిపోయి మరీ అందాల్ని ప్రదర్శించింది ఈ హాట్ భామ. మరీ ఇంతింతగా రెచ్చిపోతే ఎలా?? ఎక్స్పోజింగ్ మరీ టూమచ్‌గా ఉంది కదా? అని అడిగితే… ”హాట్‌గా కనిపించడం ఎంత కష్టమో తెల్సా?? దానికి సపరేటు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది” అన్నట్టు మాట్లాడుతోంది. అంతేనా.. ”కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకొనే కథానాయికలు ఏం చేస్తున్నారు? నాకంటే వాళ్లే ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. ఈ విషయం వాళ్లను అడగరేం?” అంటూ దబాయిస్తోంది. ఇక ముందు కూడా రేష్మిది ఇదే బాట అని.. ఈ మాటల్ని బట్టి అర్థమవుతూనే ఉంది. ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకోవాలంటే.. సాటి యాంకర్ అనసూయ గ్లామర్‌కి గట్టిగా సమాధానం ఇవ్వాలంటే రేష్మి ఈ మాత్రం కష్టపడడం తప్పదేమో?