యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సింహారెడ్డితో పాటు మరో మహిళను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆ మహిళ యాంకర్ శ్యామల కాదు. నర్సింహారెడ్డి తన వద్ద రూ. కోటి తీసుకుని మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు. 2017 నుండి ఇప్పటి వరకు విడతల వారిగా డబ్బు తీసుకున్నారని.. తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు దిగారని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఫిర్యాదు చేసింది.
డబ్బులు తిరిగి ఇవ్వకుండా సెటిల్ చేసుకోవాలటూ.. నర్సింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపింది. రాయబారం పేరుతో బెదిరింపులకు దిగడంతో ఆమెపైనా ఫిర్యాదు చేశారు. నర్సింహారెడ్డి తో పాటు రాయబారం నడిపిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మామాలుగా అయితే.. ఇది మామూల్ క్రైమ్ న్యూసే. కానీ యాంకర్ శ్యామల.. వైసీపీ నేత. తన భర్తతో కలిసి .. ఎన్నికలకు ముందు వెళ్లి జగన్ తో కండువా కప్పించుకున్నారు. ఇటీవల పతీ సమేతంగా వెళ్లి షర్మిలను కూడా కలిసి వచ్చారు.
వారికి ఎన్ని రాజకీయ యాంబిషన్స్ ఉన్నాయో కానీ.. చీటింగ్ కేసులతో అరెస్టయి… రాజకీయాలకు పనికి వస్తారన్న అర్హత సాధించుకుంటున్నారని.. సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. జగన్ స్వయంగా కండువా కప్పిన ఫోటోలను వైరల్ చేసి.. వైసీపీ అలాంటి నారికే ప్రాధాన్యం ఇస్తారని ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయంగా ఎంతో కొంత పలుకుబడి ఉన్న నర్సింహారెడ్డి.. శ్యామల ఈ కోటి రూపాయల డీల్ విషయంలో అరెస్టుల వరకూ ఎందుకు తెచ్చుకున్నారో.. వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు.