సుమ లేకపోతే… తెలుగు సినిమా వేడుకలకు శోభ లేదు. ఎక్కడ చూసినా సుమ యాంకరింగే! హీరోల్లో కూడా సుమకు ఫ్యాన్స్ ఉన్నారు. `నేను సుమకు అభిమానిని` అని చిరంజీవే చెప్పారంటే… ఇక అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నటిగానూ సుమ బిజీ. `జయమ్మ పంచాయితీ` సినిమాతో పూర్తి స్థాయి నటి అవతారం ఎత్తింది సుమ. ఇప్పుడు తన వారసుడ్ని కూడా లాంచ్ చేసేస్తోంది.
సుమ తనయుడు రోషన్ ఇప్పుడు హీరో అంత వాడయ్యాడు. అందుకే సినిమాల్లోకి లాక్కొచ్చేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకు తగిన కథ కూడా సిద్ధమైంది. ప్రశాంత్వర్మ ఈ కథ రాస్తే.. ఇప్పుడు విరించి వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడట. ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాలతో ఆకట్టుకున్నాడు విరించి. తన తొలి సినిమాలానే… ఇదో క్యూట్ రొమంటిక్ స్టోరీ అని తెలుస్తోంది. సుమ తలచుకుంటే.. నిర్మాతలు ఈజీగానే దొరికేస్తారు. సో…. నిర్మాత, హీరోయిన్, ఇతర వివరాలు త్వరలోనే.. తెలుస్తాయి. ప్రస్తుతం రోషన్.. నటన, డాన్స్, ఫైట్స్ తదితర విషయాలపై కసరత్తు చేస్తున్నాడట. నెల రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి డిటైల్స్ బయటకు వస్తాయి.