తెలుగు ఇండ్రస్ట్రీలోనే స్టార్ యాంకర్ సుమ. నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించినా, మెల్లగా బుల్లితెరపై దృష్టి పెట్టింది. యాంకర్‌గా మారింది. ఆడియో ఫంక్షన్లంటే యాంకర్‌గా సుమ పేరే గుర్తొస్తుంది. తన అల్లరితో, సరదా వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించగల నేర్పరి సుమ. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. గాయనిగా. ఔను.. సుమ ఇప్పుడు సింగర్ అయిపోయింది. ఓ పాట పాడి కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం విన్నర్. ఈ సినిమాలో సూయ సూయ అంటూ సాగే ఓ ఐటెమ్ గీతాన్ని సుమ ఆలపించింది. ఈ పాటలో మరో యాంకర్ అనసూయ నర్తించడం విశేషం. ఈ పాటని రోజు అనిరుథ్ చేతుల మీదుగా విడదుల చేస్తున్నారు. ఈ పాటని సుమ సరదాగా, ఆట విడుపుగా పాడిందా? లేదంటే సీరియస్ గానే సింగర్ గా మారాలన్న ధ్యేయంతో.. గొంతు సవరించుకొందా? అనేది తెలియాల్సివుంది. మరి యాంకర్‌గా అలరించిన సుమ.. గాయనిగా ఎన్ని మార్కులు తెచ్చుకొంటుందో చూడాలి. అన్నట్టు ఈనెల 9న విన్నర్ థియేటరికల్ ట్రైలర్ విడుదల అవుతోంది. ఈనెల 24న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.