ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కేబినెట్ లోకి ముస్లిం మంత్రిని తీసుకోవాలని నిర్ణయించారు. మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని స్పష్టంగా ప్రకటించారు. ఇప్పటికే విస్తరణ జరగాల్సి ఉందని.. కానీ హరికృష్ణ హఠాన్మరణం వల్ల.. వాయిదా పడిందన్నారు. ముస్లింలను మంత్రివర్గంలోకి తీసుకుంటానని ముఖ్యమంత్రి ఇప్పటికే రెండు, మూడు సార్లు ప్రకటించారు. గుంటూరు మైనార్టీ సదస్సులోనూ చెప్పారు. అప్పటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు ఎమ్మెల్సీ షరీఫ్ పేరు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆయన ఎప్పటి నుండో పార్టకి విధేయంగా ఉంటున్నారు. రాయలసీమ ముస్లింలకు చాన్సివ్వాలనే వాదన కొత్తగా టీడీపీలో వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ఫరూక్ శాసనమండలి ఛైర్మన్ గా ఉన్నారు.
ఆయన పేరూ కొద్ది రోజులుగా టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఎవరిని తీసుకుంటారన్న చర్చ చాలా రోజుల నుంచి జరుగుతోంది కానీ.. అసలు ఎప్పుడు విస్తరమ జరుగుతుందన్నదానిపై క్లారిటీ రావడం లేదు. వేచి చూసి చూసి.. తప్పదనుకున్నప్పుడు.. విస్తరణ చేస్తారు చంద్రబాబు. ప్రస్తుతం ఆయన మాటలను బట్టి చూస్తే.. ఈ పాటికి కొత్త మంత్రినో.. కొత్త మంత్రులనో.. కేబినెట్లోకి తీసుకుని ఉండేవారు. హరికృష్ణ మరణంతో వాయిదా పడింది. ఆరో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ కంటే ముందుగానే కొత్త మంత్రిని కేబినెట్లోకి తీసుకుంటారా అన్న చర్చ ఇప్పుడు టీడీపీలో ప్రారంభమయింది. అయితే… సమావేసాల ప్రారంభంలోపు.. అంటే ఆరో తేదీ కంటే ముందుగానే ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. లేకపోతే.. సమావేశాలు ముగిసే వరకైనా వెయిట్ చేయాలి.
కొత్తగా వచ్చే మంత్రికి కానీ.. మంత్రులకు కానీ.. చాలా పరిమితమైన సమయం మాత్రమే ఉంటుంది. మహా అయితే ఎడెనిమిది నెలల పదవీ కాలం మాత్రమే ఉంటుంది. విస్తరించాలన్న ఆలోచిన వ్చిన తర్వాతే చంద్రబాబు రెండు, మూడు నెలల పరిశీలన చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం రోజుల్లోకి వచ్చారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే విస్తరించాలని ఆశావహులు కోరుకుటున్నారు. మరి వారి ఆశ చంద్రబాబు నెరవేరుస్తారో లేదో మరి..!