నవంబర్ 16న విజయవాడలో జరగాల్సి ఉన్న జాతీయ పత్రికా దినోత్సవాలకు అయ్యే ఖర్చులను భరించడానికి ప్రభుత్వం నిరాకరించింది. అంతే కాదు.. ప్రభుత్వం.. అధికారులు బిజీగా ఉంటారని.. ఆ కార్యక్రమానికి.. ఎలాంటి సహాయసహకారాలు అందించలేమని స్పష్టం చేశారు. దీంతో.. ప్రెస్ కౌన్సిల్ నిర్ఘాంతపోయింది. ముందుగా హామీ ఇచ్చి చివరికి.. పదిహేను రోజుల ముందు.. ఇలా చేతులెత్తేయడంపై.. అసహనం వ్యక్తం చేసింది. ఉన్న పళంగా.. ఢిల్లీకి వేదికను మార్చుకుని.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ముఖ్యఅతిధిగా ఖరారు చేసుకుంది. దేశవిదేశాల నుంచి ఉన్న ఆహ్వానితుల జాబితాలోని వారందరికీ.. వెన్యూ మార్పు గురించి.. సమాచారం పంపుతూ.. కార్యక్రమ నిర్వాహకులు తంటాలు పడుతున్నారు.
ప్రెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో.. జాతీయ ప్రెస్ డే ఉత్సవాలు ప్రతీ ఏటా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లోనే జరుగుతాయి. అయితే..జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత.. ఆయన మీడియాలో పని చేసే దేవులపల్లి అమర్.. విజయవాడలో ఏర్పాటు చేస్తామని ఆఫర్ ఇచ్చారు. దేవులపల్లి అమర్ ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. అలాగే.. భారత జర్నలిస్టుల సంఘం .. ఐజేయూ అధ్యక్షుడిగా ఉన్నారు. జగన్ కూడా ఓకే అన్నట్లుగా అమర్ చెప్పి.. విజయవాడలో ముఖ్యమంత్రి సమక్షంలోనే.. జాతీయ ప్రెస్ డే నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా..హఠాత్తుగా రెండు, మూడు రోజుల కిందట.. ఏపీ సర్కార్ ప్రెస్ కౌన్సిల్ కు.. ఆ జాతీయ ప్రెస్ డే వేడుకల నిర్వహణ.. సీఎం హాజరు పట్ల… నిరాసక్తత తెలుపుతూ లేఖ రాసింది. జగన్ బిజీగా ఉన్నారని.. మరో చోటు చూసుకోమని మొహం మీదనే చెప్పేశారు.
జగన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిరాకరించడంతో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లోనే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో జరపాలని నిర్ణయించారు. ఆఖరు నిమిషంలో విదేశీ ప్రతినిధులకు సమాచారం అందించాల్సి వచ్చింది. ఈ విషయంలో మొత్తంగా దేవులపల్లి అమరే.. దోషిగా మారిపోయారు. సొంత పెత్తనం తీసుకుని విజయవాడలో పెట్టించడం.. నిర్వహించేలా.. ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోవడంతో.. మొత్తానికే తేడా తెచ్చి పెట్టుకున్నారు.