తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్నో కాలేజీలకు వెళ్ళి అక్కడ చదివే స్టూడెంట్స్‌కి ఎన్నెన్నో గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చిన చరిత్ర రాధాకృష్ణకు ఉంది. ఈ రోజుకు కూడా ఆయన నిర్వహించే “ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే” కార్యక్రమంలో కానీ, “వీకెండ్ కామెంట్ బై ఆర్కె” లో కానీ ఎన్నెన్నో ఉచిత సలహాలు ఇచ్చేస్తూ ఉంటాడు రాధాకృష్ణ.అవన్నీ ఉత్త మాటల వరకే పరిమితం అని చెప్పి ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు రాధాకృష్ణ.
ఇక మహిళల గొప్పదనం గురించి ఎన్నో మాటలు చెప్పే రాధాకృష్ణ….ఆ మహిళలను ఆయన ఎంత గొప్పగా గౌరవిస్తాడో కూడా అంతే గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. కానీ నాలుగు డబ్బులు చేసుకోవడం కోసం… ఊహల్లో నుంచి పుట్టుకొచ్చే ఓ గాలి వార్త దొరికితే చాలు…..ఒక స్త్రీ వ్యక్తిత్వాన్ని హరించేలాంటి వార్త అయినప్పటికీ….ఆ వార్తను ప్రచురించడంతో పాటు అందరికీ చేరువయ్యేలా చేయడంలో ఘనాపాఠి. ఇక వెబ్ మీడియాలో గాసిప్ వార్తలు, అక్రమ సంబంధాల వార్తలపైన ఆధారపడుతూ బ్రతుకుతున్న ఒక వెబ్ సైట్ది కూడా అదే తరహా. ఆంధ్రజ్యోతి, ఆ వెబ్సైట్లు వార్తల విషయంలో ఎంతగా దిగజారతాయో ఇటీవల మరోసారి నిరూపించుకున్నాయి.
సుచీ లీక్స్ పేరుతో ఇప్పుడు మీడియాలో కనిపిస్తున్న వార్తలన్నీ సంచలనం సృష్టిస్తున్నాయి. ఎక్కువ మంది రీడర్స్ అట్రాక్ట్ అవుతున్నారు,అందుకే కొన్ని మీడియా సంస్థలు ఇంకా ఎక్కువగా ఆ సుచీలీక్స్ వార్తలను ఎలా క్యాష్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాయి.ఆ వెంటనే ఆంధ్రజ్యోతి, ఆ వెబ్సైట్లకు సమంతా, సిద్ధార్థ్‌లు గుర్తొచ్చారు. వీళ్ళిద్దరి గురించి సుచిత్ర ట్విట్టర్లో అసలు ఎలాంటి ప్రస్తావనా లేదు. కానీ అలాంటిదేదో జరగబోతోంది అని చెప్పి వార్త వండిపడేస్తే రీడర్స్ అట్రాక్ట్ అవుతారన్న విషయం కక్కుర్తి మీడియా సంస్థలకు తెలియకుండా ఉంటుందా? ఆ వెంటనే వాళ్ళకు తోచినట్టుగా వార్తలు వండిపడేశారు. సిద్ధార్థ్, సమంతాల మధ్య లవ్ స్టోరీ నడిచింది కాబట్టి వాళ్ళ పర్సనల్ ఫోటోలు ,వీడియోలు ఏవో ఒకటి ఉండే ఉంటాయని, వాటిని లీక్ చేసే అవకాశం ఉందని ఈ వెబ్సైట్ ప్రచురించింది.అది చూసి ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా అదే రాసారు . సమంతా-సిద్ధార్థ్‌ల గురించి సుచిత్ర ట్వీట్ చేసిందో లేదో తెలుసుకోవడం ఒక్క నిమిషం పని. ట్విట్టర్లో సమంతా ప్రస్తావన ఏమీ లేదని కూడా ఆంధ్రజ్యోతి వారికి తెలుసు. కానీ ఏమీ ఎరగనట్టే నెక్ట్స్ సుచీ లీక్స్ సమంతా,సిద్ధార్థ్‌ల గురించే అని చెప్పి వార్తను వండివార్చారు.
ఇక్కడ సమంతా గురించి కూడా కొంచెం చెప్పాలి.సమంతాకు ఎక్కువ మంది చేత అభినందనలు అందుకునే స్థాయి వ్యక్తిత్వం ఉంది. మిడిల్ క్లాస్ స్థాయి నుంచి స్టార్‌గా ఎదిగిన సమంతా…చాలా చిన్న వయసులోనే ఓ స్వచ్ఛంధ సంస్థను స్థాపించి ఎంతో మందికి సాయం చేస్తోంది. అలాగే సమంతాతో వర్క్ చేసిన సినిమావాళ్ళు కూడా ఆఫ్ ది రికార్డ్ కూడా సమంతా గురించి గొప్పగానే చెప్తారు. ఈ విషయాలన్నీ మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు. అలాగే సమంతాకు రీసెంట్గా నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ అయింది,త్వరలో వాళ్ళు పెళ్ళి చేసుకోబోతున్నారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాసిన్ని డబ్బులకు కక్కుర్తి పడి ఓ మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచే గాలి వార్తలను ప్రచురించే వాళ్ళ గురించి ఏం చెప్పాలి? మీడియాకు స్వేచ్ఛ ఉంటే ఉండొచ్చు కాక. కానీ బస్టాండ్‌లో నిలబడి కారుకూతలు కూస్తూ అమ్మాయిలను ఇబ్బంది పెట్టేవాళ్ళకు ……… మీడియా రాతలకు తేడా ఉండాలి కదా.
వార్తల కోసం, రీడర్స్‌ని ఆకర్షించడం కోసం ఇంతలా దిగజారే మనుషుల వాస్తవ వ్యక్తిత్వం, వాళ్ళు పాటించే విలువలు ఏ స్థాయిలో ఉంటాయో ఆలోచించుకోవాల్సింది తెలుగు ప్రజలే. తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సింది కూడా ప్రజలే. అప్పుడే మీడియా ముసుగులో విషం చిమ్మే వాళ్ళకు బుద్ధి వస్తుంది.