తెలంగాణ రాష్ట్ర సమితి.. ఓ వైపు.. కరుడు గట్టిన తెలంగాణ వాదుల్ని ఆకట్టుకునేందుకు సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసింది. ఆంధ్రులు.. ఆంధ్రులు అంటూ మళ్లీ కేసీఆర్ సహా అందరూ మాట్లాడటం ప్రారంభించారు. ఏపీకి ప్రతినిధి లాంటి ముఖ్యమంత్రిని అసభ్యంగా తిట్టడం ప్రారంభించారు. అయితే.. ఆంధ్రుల మద్దతు తమకే ఉందని చెప్పుకునేందుకు టీఆర్ఎస్ నేతలు చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. అందులో ఒకటి… నెల్లూరు యువకుడు.. కేసీఆర్ గెలుపు కోసం.. విజయవాడ నుంచి… హైదరాబాద్ వరకూ పాదయాత్ర చేయండం.
నెల్లూరు జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి మంత్రి కేటీఆర్‌పై అభిమానం పెంచుకున్నాడట. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలని ఆయన విజయవాడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ వచ్చారట. వెంటనే కేటీఆర్ ఆయనను అధికార నివాసానికి పిలిపించి.. సత్కరించి.. విందు ఇచ్చి.. ఫోటోలు దిగి పంపారు. ఎన్నికల్లో ప్రచారం చేయమని సూచించారట. కేటీఆర్ అలా.. అధికారానికి నివాసానికి పిలిచి.. సత్కరిస్తానంటే… రోజుకు వంద మంది.. పాదయాత్రగా.. విజయవాడ నుంచి బయలుదేరుతారు. కావాల్సినన్ని మాటాలు టీఆర్ఎస్ కు అనుకూలంగా చెబుతారు. అందులో వింతేముంది కానీ.. దీన్నే టీఆర్ఎస్ మీడియా.. ఆంధ్రుల మద్దతన్నట్లుగా ప్రచారం చేసుకుంది.
ఇది ఒక్కటే కాదు.. సోషల్ మీడియాలో… టీఆర్ఎస్ కార్యకర్తలు ఆంధ్రుల పేరుతో కథలు వండుతున్నారు. నేను.. కృష్ణా జిల్లా వాడిని…నాకు టీఆర్ఎస్ .. ఇరవై నాలుగు గంటల కరెంటిచ్చింది.. అని మొదలు పెట్టి.. ప్రభుత్వ పథకాలన్నింటినీ ఏకరువు పెట్టి.. చివరికి టీఆర్ఎస్కే నా ఓటు అని ముగింపు నిస్తున్నారు. ఆంధ్రుల పేరుతో ఇలా పాదయాత్రలు… ఫేస్ బుక్ పోస్టులతో హంగామా చేయడం ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. నిజంగానే.. ఆంధ్రులపై ప్రేమ ఉంటే.. సెంటిమెంట్ రాజకీయాలు ఎందుకు చేస్తారన్న ఆలోచన సహజంగానే వస్తుంది. మంచిచేస్తే.. ఆంధ్రులు కచ్చితంగా ఆదరిస్తారు. కానీ … ఇలాంటి చీప్ ట్రిక్స్‌తో అందరూ తన వెంట ఉన్నారని చెప్పుకోవడానికి టీఆర్ఎస్ ఎందుకు తాపత్రయ పడుతోందనేది ఎవరికీ అర్థం కావడం లేదు.