అమిత్ షా ముంబై పర్యటనలో తాను కేంద్ర హోంఖ ఉన్నతాధికారనుంటూ ఓ వ్యక్తి హల్ చల్ చేశారు. రెండు రోజుల పాటు ముంబయి పర్యటనకు వెళ్లారు. అక్కడ భాజపా నేతలతో సమావేశమయ్యారు. బుధవారం ఆ పర్యటన ముగిసింది. ఈ రెండు రోజుల పాటు ఆయన వెంటే కేంద్ర హోంశాఖ అధికారినంటూ ఆ వ్యక్తి కూడా తిరిగాడు. చివరికి అసలు ఆయనెవరో తెలియదని నిర్ధారించుకుని అదుపులోకి తీసుకుని తీరా అసలు వివరాలు కనుక్కునేసరికి మైండ్ బ్లాంక్ అయింది. అతను ఓ ఆంధ్రా ఎంపీకి పర్సనల్ సెక్రటరీగా తేలింది. దీంతో సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారు.
ఆ వ్యక్తి పేరు హేమంత్ పవార్. తెలుగు వ్యక్తి కాదు. కానీ తెలుగు ఎంపీకి పీఎస్‌గా ఉన్నారు. వ్యక్తి హోం మంత్రిత్వ శాఖ ఐడీ కార్డు ధరించి భద్రతా బృందంలో కనిపించాడు. అమిత్ షాకు దగ్గర్లోనే తిరిగాడు. భద్రతా సిబ్బంది బృందంలో ఆ పేరు లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని అరెస్టు చేసి, ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. హేమంత్ పవార్‌పై ఐపీసీ 170, 171 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అతను ఆంధ్రప్రదేశ్ ఎంపీ అనుచరుడినని, వ్యక్తిగత కార్యదర్శినని అతను చెప్పుకొన్నట్లు తెలిపారు. అయితే ఆ ఎంపీ ఎవరనేది ఇంకా తెలియలేదు. తెలుగు ఎంపీలు ఇతర ప్రాంతాల వారిని పర్సనల్ సెక్రటరీలుగా పెట్టుకోవడం అరుదు. అయితే ఆంధ్రా నుంచి ఎంపీగా పరిమళ్ నత్వనీ ఉన్నారు ఆయన ఉండేది ముంబైలోనే. ఆయన పర్సనల్ సెక్రటరీ అయి ఉండవచ్చని కొన్నిఅనుమానాలు ఉన్నాయి. అయితే ఆయన .. తన పీఎస్‌ను అమిత్ షా టూర్లో హోంశాఖ ఉద్యోగిగా అనుకరిస్తూ ఉండాలని ఎందుకు పంపుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఆ ఎంపీ ఎవరు… హేమంత్ పవార్‌ను అమత్ షా టూర్‌లోకి చొచ్చుకు వచ్చేలా ఎందుకు చేశారన్నది ఇప్పుడు టాప్ ప్రయారిటీగా పోలీసులు వెలికి తీస్తున్నారు. ఈ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.