ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల్లో చరిత్ర సృష్టిస్తోంది. కనీ వినీ ఎరుగని అప్పులు అనే పదానికి అర్థం చెబుతోంది. ఓ ప్రభుత్వం ఆరు నెలల్లోనో.. ఏడాదినో చేసే అప్పులను నెలలో చేసి చూపించి రికార్డులు సృష్టిస్తోంది. గత ఏడాది ఆర్థిక సంవత్సరం మొత్తంఅప్పులు రూ. 80వేల కోట్లు దాటాయనే ఆశ్చర్యం ప్రజల్లో ఉండగాన.. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే రూ. 29 వేల 418 కోట్ల అప్పు చేశారనే నిజం.. మరింతనోరు వెళ్ల బెట్టేలా చేసింది. అటు కేంద్రం ఆదాయం.. ఇటు పన్నుల ఆదాయం.. అన్నీ కలిపి ఏం చేస్తున్నారనే చర్చ.. సామాన్య ప్రజల్లో ప్రారంభమయింది.
ఆదాయం తగ్గిందంటూ ఓ వైపు పన్నుల బాదుడు..!
ప్రభుత్వం ఆదాయం తగ్గిందంటూ.. ప్రతి పదిహేనురోజులకు ఓపన్ను పెంచుతోంది. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు… అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నులను నాలుగు సార్లు పెంచారు. కరెంట్ చార్జీలు పెంచారు. చివరికి… ఫైబర్ నెట్ చార్జీలు కూడా పెంచారు. దాదాపుగా.. ప్రతీ పన్ను పెంచారు. రేపోమాపో భూముల విలువను పెంచి.. రిజిస్ట్రేషన్ చార్జీల భారం వేయబోతున్నరాు. ఇక మద్యం గురించి చెప్పాల్సిన పని లేదు. తాగే వారిని తగ్గిస్తూంటే.. ఏడాదిలో డబుల్ చేసినంత పని చేశారు. ఆదాయం… తగ్గిపోతోందని.. వాటిని పెంచుకునేందుకు ఇలా.. పెంచుతున్నామని.. నేరుగానే జీవోలు విడుదల చేస్తున్నారు అధికారులు. అంటే.. ఆదాయాన్ని.. ఎప్పటికప్పుడు.. రాబట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు ఎక్కువగానే చేస్తున్నారు.
రాష్ట్రాన్ని అమ్మేసేంత అప్పులూ చేస్తున్నారు..!
రెండు నెలల్లో … 29, 418 కోట్ల రూపాయల అప్పు అంటే మామూలు విషయం కాదు. రాష్ట్ర జనాభా ఐదు కోట్లు అనుకుంటే.. రెండు నెలల్లో ఒక్కొక్కరి పేరుపై.. దాదాపుగా ఏడు వేల రూపాయల అప్పులు చేశారు. వారి కడుతున్న పన్నులకు అదనం ఇది. గత ఏడాది చేసిన అప్పులు.. అంతకు ముందు ప్రభుత్వాలు చేసిన అప్పులతో పోలిస్తే.. ఈ సగటు చాలా ఎక్కువ. కరోనా కారణంగా ఎఫ్ఆర్బీఎం పరిమితుల్లో కేంద్రం సడలింపులు ఇవ్వడంతో ఆ అవకాశాన్ని గరిష్టంగా వాడుకుంటోంది. ఇక ఆర్బీఐకి తెలియకుండా.. పెద్ద ఎత్తున అప్పులు చేస్తోంది. ఆఫ్ బారోయింగ్స్ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుంటోంది. వడ్డీ ఎంత అనే లెక్కలే వేయడం లేదు. చివరికి అమెరికాలోని ప్రైవేటు ట్రస్టులు అప్పులిస్తాయంటున్నాయని.. గ్యారంటీ ఇవ్వాలంటూ కేంద్రం వద్దకే వెళ్లారు.
అభివృద్ధి లేదు.. అంతంతమాత్రం సంక్షేమం.. నిధులన్నీ ఏమయ్యాయి..?
గత రెండు నెలల్లో ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు.. అంటే వేల కోట్లు ప్రజల ఖాతాలకు బదిలీ చేసే పథకాలేమీ అమలు చేయలేదు. రైతు భరోసా పథకానికి మే నెలలో రూ. 3వేల కోట్లు మాత్రం కేటాయించారు. మిగతావి అన్నీ.. అతి తక్కువ లబ్దిదారులు.. అంతే తక్కున నిధులు.. మహా అయితే.. రూ. 200 కోట్లతో మ..మ అనిపించే పథకాలు అమలు చేశారు. అదే సమయంలో.., ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క అభివృద్ధి పనీ జరగడం లేదు. గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులన్నింటినీ ఎక్కడివక్కడ నిలిపివేశారు. పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో పనులు ఎలా జరుగుతున్నాయో తెలియని పరిస్థితి. అమరావతి లేదు.. మూడు రాజధానుల్లేవ్. అసలు నిధులన్నీ ఏం చేస్తున్నారనేది.. పెద్ద మిస్టరీగా మారిపోయింది.
రేపోమాపో ఆస్తులూ అమ్మేస్తారు..! ఇక దివాలానే..?
ఏపీ సర్కార్.. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడమే కాదు.. ఆస్తుల్ని..అడ్డంగా అమ్మేయడానికి బిల్డ్ ఏపీ ప్రోగ్రాంను పెట్టుకుంది. ప్రజా ఉపయోగంలో ఉన్న ఆస్తులన్నీ.. అమ్మడానికి వరుసగా ఏర్పాట్లు చేసుకుంటోంది. కోర్టుల్లో కేసులు ఉన్నా… ఎవరైతే మాకేంటి అనుకునే ప్రభుత్వం.. అమ్మక మానదు. అంటే.. ఆస్తులు అమ్మేసి..అప్పులు మిగల్చబోతున్నారు. సంపద లేని.. అప్పుల కుప్ప రాష్ట్రంగా ఏపీ మిగలబోతోంది. దాని పర్యవసానం.. దివాలానే అని.. ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు..
గత ప్రభుత్వం 2019 ఏప్రిల్ , మే నెలలకి 7,346 కోట్లు అప్పు చేయగా..
శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం 2020 ఏప్రిల్ , మే నెలలకి 29,418 కోట్లు అప్పు చేసింది
ఈ ఇయర్ మీ టౌన్ లో మంచి రోడ్డు లు వేశారా? మీ జిల్లాలో కొత్త ప్రాజెక్ట్ లు కట్టారా?
లేదా
ఈ డబ్బు కుల + ఓటు బ్యాంక్ కి వెళ్లిందా ? pic.twitter.com/wJkBxmzYgU
— Telugu360 (@Telugu360) July 28, 2020