మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నంది అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2014, 2015, 2016 నంది అవార్డు విజేతల వివరాల్ని ప్రస్తుతం అవార్డు కమిటీ ఛైర్మన్ గిరిబాబు ప్రకటిస్తున్నారు. వాటితో పాటు రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీఆర్ జాతీయ అవార్డు, బీఎన్ రెడ్డి చక్రపాణి అవార్డులన్ని సైతం కమిటీ ప్రకటించింది. ఎన్టీఆర్, మహేష్‌బాబు, బాలకృష్ణ ఉత్తమ నటులుగా నంది అవార్డులకు ఎంపికయ్యారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డుల్ని కమల్, రజనీకాంత్, రాఘవేంద్రరావులకు ప్రకటించారు. ఉత్తమ చిత్రాలుగా బాహుబలి, లెజెండ్, పెళ్లి చూపులు నిలిచాయి. 2016 రఘుపతి వెంకయ్య పురస్కారం చిరంజీవికి దక్కింది. 2014కు గానూ కృష్ణంరాజు ఈ అవార్డును అందుకోనున్నారు. 2016 బిఎన్ రెడ్డి – చక్రపాణి అవార్డు బోయపాటి శ్రీనుకి దక్కింది. 2014కు గానూ నారాయణమూర్తి ఈ అవార్డు అందుకోబోతున్నారు. ఉత్తమ బాల నటుడిగా మహేష్ బాబు కుమారుడు గౌతమ్ (నేనొక్కడినే) ఎంపికయ్యాడు. పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో..