ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాంలో ఉన్న అత్యంత ఘోరమైన భాషా దుర్గంధం ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. కేటీఆర్ ప్రారంభించారు.. కాంగ్రెస్ దాన్ని పీక్స్ కు తీసుకెళ్తోంది. కొండా సురేఖ పై ఓ జుగుప్సాకరమైన పోస్టు పెట్టించి కేటీఆర్ సమర్థించుకున్నారు. అంతేనా చిట్ చాట్ లో రాహుల్ గాంధీపై ఘోరమైన వ్యాఖ్యలుచేశారు. రాహుల్ గాంధీ ఎక్కడ సచ్చాడన ప్రశ్నించారు. ఈ కామెంట్ల గురించి తెలిసిన తర్వాత కొండా సురేఖ రెచ్చిపోయారు. కొండా సురేఖ ఘోరమైన విమర్శలు చేసిన తరవాత బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ ఆడియోను లీక్ చేసింది. వేరొక మహిళతో కొండా సరేఖ మాట్లాడుతున్న ప్రైవేటు సంభాషణ అది. అందులో అసభ్యకరమైన మాటలు ఉన్నాయి.
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ క్రిషాంక్ దాన్ని ఆన్ లైన్ లో పెట్టారు. ఆ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది.. ట్యాపింగ్ చేసినప్పుడు రికార్డింగ్ చేసిందా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఇది ఎక్కడికి వెళ్తుందో చెప్పడం కష్టం. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇదే రాజకీయం నడిచేది. పేర్ని నాని, కొడాలి నాని, రోజా , పోసాని ఇలా ప్రతి ఒక్కరూ తమదైన భాషతో ఏపీలో దుర్గంధం వ్యాపింప చేశారు. పుట్టుకల దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశాన్ని యధాలాపంగా మాట్లాడుకునేలా చేశారు. కుటుంబాలని కూడా సోషల్ మీడియాకు ఎక్కించుకున్నారు.
వైసీపీ తిడితే టీడీపీ ఊరుకుటుందా వారు కూడా వైసీపీ కుటుంబాల్ని రోడ్డు మీదకు లాగారు. ఎన్నికల తర్వాత ఏపీలో మార్పు వచ్చింది. ఇప్పుడు అక్కడ రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి కానీ బూతులు లేవు. వైసీపీ నేతలు సంప్రదాయినీలుగా మారిపోయారు. టీడీపీ నేతలు ఎప్పుడూ గీత దాటరు. కానీ తెలంగాణలో అవే సీన్లు రిపీటవుతున్నాయి.