ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు పెట్టాలనుకున్నప్పుడు.. ఏ బిల్లులు పెట్టాలనుకుంటున్నామో… అందులో ఏముంటుందో.. ప్రకటించడం సంప్రదాయం. ప్రజోపయోగం కోసం.. తాము కొత్త చట్టాలు చేస్తున్నామని.. చెప్పుకునేందుకు..ఆ చట్టాలు ప్రజలకు ఎంత మేర ఉపయోగపడతాయో చెప్పేందుకు.. ఈ పని చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం… ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి.. ఏ బిల్లులు అందులో ప్రవేశ పెట్టబోతున్నామో.. అందులో ఏముంటుందో.. కనీస మాత్రం సమాచారం కూడా.. బయటకు పొక్క నీయడం లేదు. రాజధాని తరలింపు కోసం.. అనే విషయం కూడా అధికారికంగా ఎక్కడా చెప్పలేదు.
సీఆర్డీఏ చట్టం రద్దు.. జోనల్ డెవలప్మెంట్ కౌన్సిళ్ల బిల్లులను పెడతామని.. మీడియాకు సమాచారం లీక్ చేశారు కానీ.. అధికారికంగా మాత్రం.. అసలు ఏ బిల్లులుంటాయి.. అందులో ఏముంటాయన్న దాన్ని మాత్రం చెప్పడం లేదు. బిల్లుల రూపకల్పనలో.. అత్యంత విశ్వసనీయమైన అధికారులను మాత్రమే.. వినియోగించుకుటున్నారు. వారికి కూడా.. బిల్లులో ఉన్న విషయాలేమీ బయటకు వెళ్లకూడదని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ప్రభుత్వం తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది.
బిల్లుల్లో ఏముందో తెలియకుండా.. అసెంబ్లీ పెట్టి ఆమోదించుకుంటే… అది సంప్రదాయం కాదని అంటున్నారు. బిల్లును సభ్యులందరికీ ముందుగా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఏ సంప్రదాయాన్నీ పాటించడం లేదు. అందుకే.. ఈ విషయాన్ని కూడా చాలా మంది లైట్ తీసుకున్నారు. న్యాయపరమైన వివాదాలు.. కోర్టు స్టేలు రాకుండా.. బిల్లు విషయంలో… ప్రభుత్వం గోప్యత పాటిస్తున్నట్లుగా తెలుస్తోంది.