ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలుు మూడో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలల్లోపు ఓ సారి అసెంబ్లీని ఖచ్చితంగా సమావేశపర్చాల్సి ఉంటుంది. ఈ నిబంధన అమలు చేయడానికి అయినా అసెంబ్లీని సమావేశపర్చాల్సి ఉంటుంది. అదే సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడంతో డిసెంబర్ ఎన్నికల కోసం ఏపీ ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా రెడీ అవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
వినాయకచవిత తర్వాత.. అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలను 10 రోజుల నుంచి 15 రోజులపాటు నిర్వహించాలని భావింస్తోంది అధికార పార్టీ. సెప్టెంబరు రెండోవారంలో సమావేశాలను నిర్వహించాలని ముందుగా భావించారు. కానీ సీఎం జగన్ మొదటి వారంలో లండన్ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో సమావేశాలు సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. వారం రోజుల పాటు నిర్వహించాలని అధికార పార్టీ భావిస్తోంది.
సెప్టెంబర్ 15న సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ఆరేడు నెలల సమయం ఉంది. కానీ ఏపీలోని అన్ని నియోజకవర్గాలకు ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. కేంద్రం కూడా డిసెంబర్ లో ఎన్నికలకు వెళ్లబోతోందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అప్పుడే అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.