ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలాల్లో జరిగినంత రచ్చ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎప్పుడూ జరిగి ఉండదు. అయితే మహిళలని కూడా చూడకుండా .. మీ పిల్లలు ఎవరికి పుట్టారన్న దారుమమైన మాటలతో తిట్లు వినిపిస్తాయి. వీటికి అధికారపక్షం మహిళా సభ్యులు కూడా పగలబడి నవ్వుతూ ఉంటారు. లేకపోతే సీఎంజగన్‌పై ట్రోల్ చేసి నవ్వుకునేంత స్థాయిలో పొగడ్తలు కురిపిస్తూ ఉంటారు. మొదటి రెండు రోజులు బూతుల సన్నివేశాలు కనిపిస్తే తర్వాత అంతా పొగడ్తల వర్షమే అసెంబ్లీలో కురిసింది.
త్వరలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉండటతో సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఇంత కన్నా మంచి అవకాశం దొరకని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా మైక్ దొరకగానే స్తోత్రాలు వినిపించేశారు. మహిళా ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా పేపర్లపై రాసుకు వచ్చి మరీ కవితల రూపంలో సీఎం జగన్‌ను పొగిడేశారు. విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అసెంబ్లీలో జగన్‌పై ఓ కవిత రాసి . దాన్ని రాగయుక్తంగా పాడారు. ఈ వీడియోను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.కొంత మంది జగన్‌ను, వైఎస్‌ను పొగిడే క్రమంలో కొన్ని అనూహ్యమైన ప్రకటనలు చేయడంతో సో,ల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. మాజీ మంత్రి పార్థసారధి చంద్రబాబు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ బిల్డింగ్ మాత్రమే కట్టించారని..కానీ వైఎస్ రాజశేకర్ రెడ్డి ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వడం వల్లనే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు.
శాసనమండలిలోనూ జగన్‌పై పొగడ్తలు కురిపించేందుకు పలువురు పోటీ పడ్డారు. అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ గా.. ఎమ్మెల్సీగా ఉన్న మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ కూడా పొగడ్తల విషయంలో పోటీ పడ్డారు. ఏపీలో సీఎం జగన్ పాతికేళ్లు సీఎంగా ఉంటారని.. ఆ తర్వాత దేశానికి ప్రధానమంత్రి అవుతారని పొగిడేశారు. సినిమా డైలాగులు చెప్పడంలో వైసీపీ సభ్యులు అందరూ రాటుదేలిపోయారు. అయితే దాదాపుగా అందరూ పొగడటంతో అందరికీ పదవులు ఇవ్వలేరు కదా.. ఎవరో ఒకరు తమ పొగడ్తలు వృధా పోయాయని అనుకోక తప్పదు మరి…!