ఏపికి బడ్జెట్లో సరైన కేటాయింపులు జరగలేదని తెలుగుదేశం అధినేత ఆగ్రహం ప్రకటిస్తున్నా మీరేమీ పట్టింంచుకోవద్దని బిజెపిఅ అద్యక్షుడు అమిత్ షా పార్టీ వారికి సూచించారట.ఇరు రాష్ట్రాల నేతలతో విడివిడిగా సమావేశమైన అమిత్ షా రకరకాల లెక్కలు వాదనలతో మనకేమీ కాదని భరోసా ఇచ్చి పంపించారు. తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లో బిజెపిని వదలి ఎక్కడికీ పోలేదనీ కనుక సామరస్యంగా వుంటే మంచిదని సోము వీర్రాజు వంటివారికి ఆయన వివరించారు. అక్కడి దాకా వస్తే అప్పుడు చూద్దామన్నారట.తెలంగాణలోనైతే 119 సీట్లలోపోటీ చేయిస్తామరి చెప్పడం దాదాపు హాస్యాస్పదంగా తయారైంది. అది కూడా పరోక్షంగా టిఆర్ఎస్కే మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇలా ఇరు ప్రభుత్వాలతో మంచిగా వుంటూనే తన మనుగడ కాపాడుకోవాలనీ, వైసీపీ ఆఫర్ కూడా అట్టిపెట్టుకోవాలనీ బిజెపి వ్యూహకర్తలు భావిస్తున్నారు. అయితే పైకి మాత్రం అదేమీ లేదని ఖండిస్తుంటారు. ఒక వైపున కేంద్ర బడ్జెట్ దెబ్బకు వ్యాపార పారిశ్రామిక మధ్య తరగతి వర్గాలు కూడా మనకు దూరమైనాయని ఎంపిలు మంత్రులు ఘోషిస్తున్నారు. స్టాక్ మార్కెట్ కుదేలై పోయింది. అయినా మేకపోతు గాంభీర్యంతో నెట్టుకు రావాలని బిజెపి భావిస్తున్నది. టిడిపి ఎంత హడావుడి చేసినా బిజెపి పట్టించుకోదనేది అర్థమవుతూనే వుంది. గూబ గుయ్యిమనేవరకూ ఎవరికైనా అలాగే వుంటుంది మరి! ఈ సందర్భంగానే సీట్ల పెంపు వుండబోదని కూడా బిజెపి అధిష్టానం స్పష్టత ఇచ్చినట్టు సమాచారం.