వైసీపీ అవినీతి వ్యవహారాలు, చట్ట ఉల్లంఘనల మొత్తాన్ని లెక్క తేల్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. అక్రమార్కులను, వేధించిన వారిని క్షమించేస్తున్నారని ఇది ఎంత మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వినిపిస్తూండటంతో రెండురోజుల కిందట చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. కేసులపై సమీక్ష చేశారు. జెత్వానీ కేసును ముందుగా సీఐడీకి ఇవ్వాలన్న దిశగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలని చంద్రబాబు స్ఫష్టం చేశారు.
ఇక లిక్కర్, ఇసుక వంటి కేసుల్లో సాక్ష్యాలు బయటకే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ కఠిన చర్యలు తీసుకోలేదు. కానీ పూర్తిగా సీఐడీ ఈ కేసుల్లోనూ రంగంలోకి దిగి.. అరెస్టులు ప్రారంభించాలని డిసైడయింది. గనుల ఘనుడు వెంకటరెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశారు. లిక్కర్ స్కాంలో అసలు కింగ్ పిన్ ను బుక్ చేయడానికి వాసుదేవరెడ్డిని ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. అసలు వివరాలన్నీ సేకరించినందున త్వరలోనే వాసుదేవరెడ్డిని కూడా అరెస్టు చేసి.. సంచలనాత్మక వివరాలను బయట పెట్టాలనుకుంటున్నారు.
కక్ష సాధింపులు అన్న భావన రాకుండా …. తప్పు చేశారు కాబట్టి శిక్ష అన్న భావన రావాలని.. ప్రజల్లోకి ఇదే సందేశం స్పష్టంగా వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కీలక అరెస్టులు చేసే ముందు వారు ఎలాంటి తప్పులు చేశారో స్పష్టంగా ప్రజలకు తెలిసేలా చేయనున్నారు. జెత్వానీ విషయంలో అదే చేస్తున్నారు. పోలీసులు ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో అంతా ప్రజల ముందు పెట్టారు. వారికి న్యాయపరమైన అవకాశాలను కూడా ఇస్తున్నారు. వారు చేసిన తప్పులకు కోర్టుల్లోనూ రిలీఫ్ రావడం కష్టం కాబట్టి … ఇవాళ కాకపోతే రేపైనా అరెస్టులు ఉంటాయని అంటున్నారు.