కేంద్రం.. బడ్జెట్ ప్రవేశ పెట్టింది. తమకు అంతో ఇంతో న్యాయం జరిగిందనుకున్న రాష్ట్రాలు.. శభాష్ అన్నాయి. అన్యాయం జరిగిందని.. భావించిన రాష్ట్రాలు అదే విషయాన్ని చెప్పాయి. కానీ ఏపీ సీఎం మాత్రం.. ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా.. తన స్పందన వ్యక్తం చేయలేదు. ఎంపీ విజయసాయిరెడ్డితో… ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో మాత్రం.. మాట్లాడించారు. ఓ ప్రభుత్వ అధికారిక స్పందన తెలియాలంటే.. ప్రభుత్వాధినేత మాట్లాడితే మాత్రమే లెక్కలోకి వస్తుంది. లేకపోతే.. కేంద్రం.. పట్టించుకోదు. తమకు అన్యాయం జరిగిందని భావించే పక్షంలో..రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిరసనను.. ఏ మాత్రం దాచుకోవు. ఎందుకంటే.. అలాంటి నిరసనను బట్టే.. సవరణల సమయంలో.. ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు.
ఏపీకి ప్రత్యేకహోదా దగ్గర్నుంచి విభజన హామీల వరకూ.. ఏ అంశంలోనూ బడ్జెట్లో సానుకూలత లేదు. పోలవరం ప్రాజెక్ట్‌కి మాత్రమే కాదు.. అమరావతికి కూడా రూపాయి కేటాయించలేదు. వెనుకబడిన జిల్లాలకు ఆపేసిన నిధుల దగ్గర్నుంచి.. ఏ అంశంపైనా క్లారిటీ లేదు. ఏపీ నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు కాబట్టి.. అందులో… ఆర్థిక సంఘం ప్రతిపాదించిన మేరకు.. వాటా ఇస్తున్నారు. అంతకు మించి.. కేంద్రం తరపున.. వచ్చేసాయం ఏదీ కనిపించలేదు. ఏపీ ప్రభుత్వం.. నిలబడాలంటే.. కచ్చితంగా.. కేంద్ర సాయం అవసరం అన్నది నిపుణలు అభిప్రాయం మాత్రమే… వైసీపీ ఎంపీల అభిప్రాయం కూడా. కేంద్రం సాయం చేయకపోతే.. ప్రభుత్వ నాలుగు నెలల్లో దివాలా తీస్తుందని.. ఎంపీ మిధున్ రెడ్డి.. లోక్‌సభలోనే ఆందోళన వ్యక్తం చేశారు.
పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ… జగన్మోహన్ రెడ్డి బడ్జెట్‌పై తన అభిప్రాయాన్ని కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేయడం లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ఆయన అభిప్రాయం.. ఆయన పార్టీకి మాత్రమే అవసరం. కానీ సీఎంగా ఉన్నప్పుడు.. అది ప్రజలందరికీ సంబంధించిన అవసరం. ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా.. స్పందించాల్సిన.. వ్యవహరించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కానీ.. ఇప్పటి వరకూ.. అలాంటి స్పందనేమీ.. జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేయకపోవడం.. అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.