అభివృద్ధి పనులకు ఎస్ఈసీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉత్తర్వులు సవరించాలని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లిందో… క్లారిటీ వచ్చేసింది. జిల్లాల విభజనకు సంబంధించి .. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అభ్యంతరాలు తెలుపుతూ ఏపీ సర్కార్‌కు లేఖ రాశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉంది. ఇంకా ఆ ప్రక్రియను రద్దు చేయలేదు.ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న దానిపైనా స్పష్టత లేదు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేదు. ఈ కారణంగా ఎన్నికల అంశం ప్రస్తుతానికి పీట ముడి పడింది.
అయితే ఎన్నికలకు కరోనా కారణంగా చెబుతున్న ఏపీ ప్రభుత్వం .. ఇతర ఏ పనులనూ ఆపడం లేదు. అందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటునూ వేగం చేసింది. 32 జిల్లాలను చేయాలనుకుంటున్నట్లుగా మంత్రి వనిత ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ కూడా సమీక్షలు చేస్తున్నారు. జవరిలో కొత్త జిల్లాలో ప్రకటన ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు పదమూడు జిల్లాల ప్రాతిపదికనే జరుగుతున్నాయి కాబట్టి.. అవి పూర్తయ్యే వరకూ.. జిల్లాల విభజన వద్దని.. ఎస్ఈసీ కోరుతున్నారు . ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత చేసుకోవచ్చని ఆయన ఉద్దేశం.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసేవరకూ.. ఎన్నికలు నిర్వహించకూడదన్న ఉద్దేశంతో ఏపీ సర్కార్ ఉంది. ఆయన పదవీ కాలం వచ్చే మార్చి వరకూ ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం తనకు నచ్చిన ఎన్నికల కమిషనర్‌ను అపాయింట్ చేసుకుని ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ అప్పటిదాకా జిల్లాల విభజన ఆపాల్సి ఉంటుంది. లేకపోతే.. ఇప్పుడే ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. తాను స్వయంగా సుప్రీంకోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సిందేనని… ఉత్తర్వులు తెచ్చుకున్నందున…ఈసీని కాదని.. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం లేదు. దీంతో ఏపీ సర్కార్… సింపుల్‌గా చేద్దామనుకుంది కానీ.. అది చిరిగి చేటయిందన్నట్లుగా పరిస్థితి మారిపోయిందనే సెటైర్లు పడుతున్నాయి.