పర్యావరణ అనుమతులు తీసుకునే వరకూ ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. చెప్పింది సుప్రీంకోర్టు కాబట్టి తక్షణం ఇసుక తవ్వకాలు ఆపేస్తారని ఎవరైనా అనుకుంటారు. సహజంగా అదే చేయాలి. కానీ ఇక్కడ ఏపీలో ఉన్న పాలకులకు.. సుప్రీంకోర్టా… రాజ్యాంగమా అన్నది అనవసరం… తమ చేతిలో యంత్రాంగం ఉంది.. అదికారంలో తామున్నాం కాబట్టి అనుకున్నట్లుగా చేసేస్తామని అనుకుంటారు…చేసేస్తారు అంతే. ఆ విషయంలో ఎలాండి డౌట్ లేదు. ఇసుక విషయంలోనూ అదే జరుగుతోంది.
టీడీపీ హయాంలో ఉచిత ఇసుక విధానం అమలయింది. ఇష్టారీతిన తవ్వకాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఇసుక మొత్తం ఒకరే దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీ కూడా అడ్డగోలుగా సాగుతోంది. ఎక్కడ ఇసుక ఉంటే అక్కడ పెద్దపెద్ద యంత్రాలతో తవ్వేస్తున్నారు. వందల కొద్ది లారీల్లో ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలి పోతోంది.ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరినా… ఎన్జీటీ పర్మిషన్లు తీసుకునేవరకూ ఆదేశించినా పట్టించుకోవడం లేదు. జేపీ పేరుతో తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.
151 సీట్లు వచ్చాయన్న కారణం.. తామే సుప్రీం అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే నిబంధనలు, రాజ్యాంగం, చట్టాలు అనే ప్రస్తావన లేకుండా పరిపాలన చేస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలనూ అమలు చేయని పరిస్థితి ఏపీలో వచ్చింది ఇక ముందు ముందు ఎపీలో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ?