ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమయింది . ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను మార్చి పదో తేదీన ప్రకకటించారు. అయితే ఈ సారి ఆలస్యం అయింది.. ఎన్ని రోజులు అన్నది ి సస్పెన్స ్గా మారింది. ఎన్నికల కమిషన్ (ఈసీ) సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కశ్మీర్లో పర్యటించనుంది. అక్కడ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించగలమనేది మూడు రోజుల పర్యటనలో అంచనా వేయనుంది. తర్వాత ఒకటి రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించవచ్చు.
షెడ్యూల్‌ను మార్చి 14-16 తేదీల మధ్యన ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనున్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది సెప్టెంబరు లోపు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించగలిగే అవకాశం ఉందేమో అంచనా వేయాలని కేంద్ర ప్రభుత్వం ఈసీని కోరింది.
సాధారణంగా లోక్ సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆరేడు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలోనే ఏపీ ఎన్నికలు ఉంటాయి. ఈ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏప్రిల్ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశముంది.య ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే ‘కోడ్’ అమలులోకి వస్తుంది.