ప్రభుత్వం జీతాలివ్వట్లేదు. దాచుకున్న సొమ్మునూ ఇవ్వట్లదు .. మీరైనా చెప్పండి అంటూ ఉద్యోగులు.. గవర్నర్ ను కలిసి మొరపెట్టుకున్నారు. ఏపీలో జరిగే చిత్ర విచిత్రాల్లో ఇదీ ఒకటని అనుకోవాలి. ప్రభుత్వం అంటే ఉద్యోగులు. కానీ సలహాదారులతో పని కానిచ్చేస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగుల జీతాలు, ప్రయోజనాలను మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది. చివరికి జీతాలు కూడా ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. ఇక వారి జీపీఎఫ్ డబ్బులూ వెనక్కి తీసుకున్నారు. వారు దాచుకున్న డబ్బులు కనీసం ఇరవై వేల కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. ఎన్ని సార్లు అడిగినా ఇవ్వడం లేదు. దీంతో వారు గవర్నర్ కు ఫిర్ాయదు చేశారు.
ప్రభుత్వం దగ్గర ఉన్న ఉద్యోగుల బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని .. ఎన్ని సార్లు అడిగినా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఉద్యోగ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారులు గవర్నర్ కు ఉంటాయని.. ఉద్యోగ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించలేకపోతోందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. కోట్లాది రూపాయల బకాయిలు, పెన్షన్ల చెల్లింపుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకపోతే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది… 15వ తేదీ వరకు జీతాలు పడుతునే ఉంటాయని, పెన్షన్ల పరిస్థితి అలాగే ఉందని.. ఈ అంశాలన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని ఉద్యోగ నేతుల ప్రకటించారు.
ఉద్యోగులు,పెన్షనర్లు,దినసరి కార్మికులకు చెల్లించాల్సిన నిధులు నెల చివరి రోజు లేదా తర్వాత నెల మొదటి రోజు చెల్లించాలని, ఉద్యోగుల వ్యవహారాల్లో ప్రభుత్వం జాలి చూపించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు. ల సంక్రాంతి పండుగ నుంచి బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ ఈ సారి మళ్లీ ఏప్రిల్ నుంచి ఇస్తామని చెబుతోంది. ఈ కారణంగా ఏప్రిల్ నుంచి బకాయిలు చెల్లించకపోతే ఇక తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి.