ఏపీ ఉద్యోగ సంఘం నేతలు అమ్ముడుబోయారని ఇక వారిని నమ్ముకోవడం కన్నా తాము రోడ్డెక్కడం మంచిదన్న భావనకు ఏపీ ఉద్యోగులు వస్తున్నారు. ఏపీ సీపీఎస్ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు అదే చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల నాయకులు ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ ఈ ఒప్పందం ఇష్టం లేదు.. అందుకే వారు కోర్టుకెళ్లి మళ్లీ ధర్నాకు సిద్ధమవుతున్నారు. సీపీఎస్ ఉద్యోగులు ఉద్యోగ నేతలపై మండిపడుతున్నారు. వారు ఇతర ఉద్యోగ సంఘం నేతల ట్రాప్ లో పడిపోయారని అంటున్నారు. జీపీఎస్ బాగుందుంటూ ప్రకటనలు చేస్తున్నారని అసలు ఆర్డినెన్స్ లో ఏముందో ప్రభుత్వం ఇంత వరకూ చెప్పలేదని… బాగుందని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగ సంఘం నేతలు స్వప్రయోజనాల కోసం … ప్రభుత్వానికి అమ్ముడుపోయే… కేసుల భయం కారణంగానో… ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమవడమే కాదు… భజనలు చేస్తున్నారు . దీంతో ఉద్యోగుల్లో తీవ్ర అసహనం ఏర్పడుతోంది. ఎన్నికల సమయంలో ఒత్తిడి తెచ్చి మరిన్ని ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన ఉద్యోగ సంఘం నేతలు ఇలా ప్రభుత్వానికి సరెండర్ కావడంతో సమస్య వస్తోంది. దీంతో ఉద్యోగ సంఘ నేతలతో సంబంధం లేకుండా రోడ్డెక్కే ఆలోచన చేస్తున్నారు. సమష్టి నాయకత్వంతో మందడుగు వేస్తున్నారు.
ప్రజాస్వామ్య హక్కులు ఈ ప్రభుత్వంలో ఎలాగూ రావడం లేదు. అరెస్టులు చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. అయినా సరే.. . న్యాయస్థానం అండతో తమ ప్రజాస్వామ్య హక్కులు కాపాడుకోవలానుకుంటున్నారు. హైకోర్టు అనుమతితో విద్యుత్, సీపీఎస్ ఉద్యోగులు ధర్నాలు చేయబోతున్నారు. ఇతర శాఖల ఉద్యోగులూ తర్వాత రోడ్డెక్కే ఆలోచన చేస్తున్నారు. ముందు ముందు ఉద్యోగుల ఆందోళన తీవ్రం కానుంది.